Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ అంటే ఆయన అభిమానులు ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనకాడరు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుందంటే చాలు ఒకరోజు ముందు నుండే థియేటర్ల వద్ద హంగామా చేస్తూ ఉంటారు. అయితే అందరి హీరో హీరోయిన్ల లాగా కాకుండా పవన్ కళ్యాణ్ ఇంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా లోకి ఎంట్రీ ఇవ్వటంతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసాడు.
పవన్ కళ్యాణ్ ఇటీవలే ఇంస్టాగ్రామ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. జూలై 4వ తేదీన ఎలుగెత్తు.. ఎదిరించు.. ఎన్నుకో.. జైహింద్ అంటూ ఒక బయోతో పవన్ తన ఇన్ స్టా ఖాతాను ఓపెన్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ అలా ఇన్ స్టా ఖాతా ఓపెన్ చేశారో లేదో కొన్ని గంటలకే ఇన్స్టాలో ఫాలోవర్స్ భారీగా పెరిగిపోయారు. ప్రస్తుతం ఇన్ స్టా లో సుమారు 2.3 మిలియన్లకు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. సాధారణంగా హీరో హీరోయిన్లకు ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం అభిమానులుగా మారిపోయారు.
Pawan Kalyan:పవన్ ఫ్యాన్స్ గా మారిపోయిన స్టార్ హీరోయిన్స్..
ఈ క్రమంలో ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో కొందరు సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్నారు. వారిలో ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు ఉండటం విశేషం. శృతిహాసన్, కీర్తి సురేష్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఇంస్టాగ్రామ్ లో పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్నారు. ఇక వీరిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి నటించారు. మొత్తానికి ఇన్స్టాగ్రామ్ లో అతి తక్కువ కాలంలో అత్యధిక ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న ఏకైక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.