Payal Raj puth: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి పాయల్ రాజ్ పుత్ ఒకరు. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా నటించిన ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమాలో చాలా బోల్డుగా నటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇలా మొదటి సినిమాకే ఈ స్థాయిలో ఈమె గ్లామర్ షో చేయడంతో తదుపరి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.
ఈ విధంగా పాయల్ తదుపరి సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పాలి దీంతో తనకు అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ అజయ్ భూపతికే మరొక అవకాశం ఇచ్చారు. అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ మంగళవారం అనే సినిమాలో నటించారు ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించడం రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలకు సెలబ్రిటీలు సమాధానం చెప్పారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా తన ఆరోగ్యం గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టారు.
కిడ్నీ సమస్యతో బాధపడుతున్న…
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ.. తాను గత కొద్దిరోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నానని తెలియజేశారు తన కిడ్నీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిందని త్వరలోనే సర్జరీ కూడా చేయాలని డాక్టర్లు సూచించినట్లు తెలిపారు. ప్రస్తుతం తాను సర్జరీ చేయించుకోకుండా మందులు వాడుతున్నానని తెలియజేశారు. తనకు కిడ్నీ సమస్య ఉందని తెలిసిన సమయంలోనే అజయ్ భూపతి గారు మంగళవారం సినిమా ద్వారా తన వద్దకు వచ్చారని కథ మొత్తం విన్నటువంటి తనకు ఈ సినిమా చేయాలనిపించింది అందుకే సర్జరీ గురించి కూడా ఆలోచించకుండా తాను ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నానని ఈ సందర్భంగా ఈమె కామెంట్ చేయడంతో పలువురు ఈ కామెంట్లపై విమర్శలు చేస్తున్నారు. ఆరోగ్యం కన్నా సినిమాలు ముఖ్యం కాదని సినిమాల కోసం ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకపోవడం దారుణం అంటూ ఈమె వ్యాఖ్యలపై కామెంట్స్ చేస్తున్నారు.