Perity Zinta: ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన ఈ అమ్మడు.. తెలుగులో కూడా సూపర్ హిట్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సొంతం చేసుకుంది. ప్రతి ఒకవైపు హీరోయిన్ గా రాణిస్తూనే మరొకవైపు వ్యాపారంగంలో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ జట్టుకు సహయజమానిగా ప్రీతి వ్యవహరిస్తోంది. అయితే తాజాగా ప్రీతి జింతాపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఈ అమ్మడు ఇలా విమర్శలు ఎదుర్కోవటానికి కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తాజాగా ప్రీతి ఎయిర్పోర్ట్ కి వెళ్లే హడావిడిలో ఉండగా ఒక వికలాంగుడు వీల్ చైర్లు ప్రీతి జింత కారు వద్దకు వచ్చి బిక్షం అడిగాడు. అయితే ఫ్లైట్ కి లేట్ అయింది అన్న హడావిడిలో మీడియాతో కూడా మాట్లాడకుండా ప్రీతి కారెక్కి వెళ్ళిపోయింది. భిక్షాటన చేస్తున్న ఆ వికలాంగ వ్యక్తి మేడం ప్లీజ్ ఎంతో కొంత దానం చేయండి అంటూ వేడుకున్నాడు. అయితే ఆ వికలాంగ వ్యక్తిని పట్టించుకోకుండా ప్రీతి కారులో ఎక్కి కూర్చోవడంతో కారు ముందుకు పోయింది. అయినా గానీ ఆ వికలాంగ వ్యక్తి కారును అందుకుందామని, ఎంతో కొంత ఇవ్వకపోదా అని దాన్ని కొంత దూరం వెంబడించాడు.
Perity Zinta: ఇంత పిసినారితనం పనికిరాదు…
అయినా కానీ ప్రీతి కారు ఆపకుండా వెళ్ళిపోయింది. ఈ ఘటన వల్ల ప్రీతీ మీద విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రూ. వందల కోట్లు ఖర్చు చేసి ఐపీఎల్ లో జట్టు కొనటానికి వెనుకాడని ప్రీతికి ఇలా వికలాంగుడికి దానం చేయటానికి రూ. 100 రూపాయలు కూడా లేవా అంటూ నెటిజన్స్ తిట్టి పోస్తున్నారు. వికలాంగుల పట్ల ఇంత పిసినారితనం పనికిరాదు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సంఘటన వల్ల ప్రీతి జింతా ని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.
View this post on Instagram