Pooja Hedge: ముకుంద సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన పూజా హెగ్డే ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న పూజ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలు అందుకుని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ఈ క్రమంలో బాలీవుడ్ నుండి కూడా వరుస అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన ” కిసీ కా భాయ్ కిసీ కా జాన్ ” సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 21 న తెలుగు,తమిళ్, హింది భాషలలో విడుదల కానుంది.
ఈ సినిమాలో టాలివుడ్ హీరొ దగ్గుబాటి వెంకటేష్ కీలక పాత్రలో నటించగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక పాట లో నటించాడు. ఇదిలా ఉండగా సినిమా విడుదల తేదీ సమీపించటంతో ప్రమోషన్ పనులను చిత్ర యూనిట్ ప్రారంభించింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పూజ హెగ్డే ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు సినిమా విశేషాలతో పాటు జీవితంలో తాను ఎదుర్కొన్న జయపజయాలు గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
Pooja Hedge:సొంత బిడ్డలా భావిస్తాను…
ఈ క్రమంలో తాను నటించిన ‘ సర్కస్ ‘ సినిమా ప్లాప్ గురించి మాట్లాడుతు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు పూజా హెగ్డే మాట్లాడుతూ..” నేను నటించే ప్రతి సినిమాలో ఎంతో ఇష్టంతో నటిస్తాను. సినిమాని సొంత బిడ్డలా భావిస్తాను. సర్కస్ సినిమాని కూడా అలాగే భావించాను. కానీ ఆ సినిమా ప్లాప్ అవటంతో చాలా బాధపడ్డాను. కానీ అందులో నేను నటించిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. అలాగే జానీ లివర్, సంజయ్ మిశ్రా వంటి నటులతో పనిచేయటం, రోహిత్ శెట్టి దర్శకత్వంలో పని చేయటం చాలా గొప్పగా భావిస్తున్నాను.” అంటూ మొదటిసారిగా తాను నటించిన సినిమా ఫ్లాప్ గురించి పూజా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.