Pooja Hedge: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముకుంద సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ అడుగుపెట్టిన పూజా హెగ్డే అలా వైకుంఠపురం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది. ఇలా తెలుగు, తమిళ్, కన్నడ నటించిన పూజ బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ‘ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో టాలివుడ్ హీరో దగ్గుబాటి వెంకటేష్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నాడు.
ఇక ఈ సినిమా ఏప్రిల్ 21 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ పనులను సినిమా యూనిట్ వేగవంతం చేసింది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ కోసం సల్లు భాయ్ తో పాటు పూజా హెగ్డే కూడా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిజీగా ఉంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలో పూజా హెగ్డే మాట్లాడుతూ..”నేను కథ చెప్పడానికే ఉన్నాను. సినిమాలలో పాటలు కూడా కథ చెబుతాయి. అందుకే నాకు నచ్చితే పాటలలో నటిస్తూ ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది.
Pooja Hedge: నటన అంటే ఎంతో గౌరవం…
అలాగే చిన్నప్పుడు తనకు డాన్స్ చేయాలంటే చాలా భయం ఉండేది. అప్పుడు మా అమ్మ భరత నాట్యం నేర్చుకోమని చెప్పింది. ఇక అప్పటి నుండి డాన్స్ అంటే భయం పోయి దానిని ఆస్వాదించటం నేర్చుకున్నా అని తెలిపింది. అంతే కాకుండా నటన అంటే తనకు ఎంతో గౌరవమని, ఏ భాషలో నటించటమైన నేను గౌరవంగా భావిస్తాను అంటూ తెలిపింది. అలాగే నటిగా తాను సాధించాల్సింది చాలా ఉందని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా పూజ నటించిన సినిమాలు అన్ని ప్లాప్ అయ్యాయి. ఇక సినిమా ఎలాంటి విజయాలు అందుకుంటుందో చూడాలి మరి.