Pooja hegde: ఒక్కసారి తనకు ట్యూన్ అయితే, వరుసగా మూడు నాలుగు సినిమాలలో ఒకే హీరోయిన్‌ను రిపీట్ చేస్తుంటారు మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన కెరీర్‌లో రిపీటెడ్ హీరోలు ఎలా ఉన్నారో రిపీటెడ్ హీరోయిన్స్ అలానే ఉన్నారు. కానీ, హీరోలను రిపీట్ చేస్తుంటే కామెంట్స్ చేయని నెటిజన్స్ హీరోయిన్స్ విషయంలో మాత్రం గురూజీని బాగానే కామెంట్స్ చేస్తుంటారు. అయినా ఇవన్నీ స్టార్స్‌కు జూజూబీ. అందుకే, ఎవరెన్నీ కామెంట్స్ చేసినా కంఫర్ట్ ముఖ్యం..అని నచ్చిన హీరోయిన్‌తోనే వరుసగా సినిమాలు చేస్తున్నారు.
ఇలియానాతో జల్సా, జులాయి..సమంతతో అ..ఆ, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు చేశారు. ఇక పూజా హెగ్డేతో అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో సినిమాలు చేశారు. చెప్పాలంటే తెలుగులో సాలీడ్ హిట్స్ ఇచ్చిన దర్శకుల్లో గురూజీనే ముందున్నారు. ఈరోజు పూజా ఈ రేంజ్‌లో ఉండటానికి కారణం హరీష్ శంకర్, త్రివిక్రమ్ శీనివాస్. అందుకే, వీరు డేట్స్ అడిగితే పూజా ఎప్పుడూ కాదనదు. కుదరకపోయినా డేట్స్ సర్దుబాటు చేస్తుంది. ఇక గత ఏడాది నుంచి పూజానే ఈ ప్రాజెక్ట్స్‌లో కన్‌ఫర్మ్ అని వార్తలు వస్తుంది ఒకటి మహేశ్ – త్రివిక్రమ్ సినిమా.
Pooja Hegde: ఏదేమైనా పూజా లక్కీ హీరోయిన్..
ఇంకోటి పవన్ కళ్యాణ్ – హరీష్ శకర్ కాంబినేషన్‌లో ప్రకటించిన భవదీయుడు భగత్‌సింగ్. అయితే, ఇటీవల కాలంలో కథ వినకుండా ఏ ప్రాజెక్ట్‌కు పూజా సైన్ చేయలేదు. అలాంటిది త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు మాత్రం మహేశ్ సినిమా కోసం కథ వినకుండా..ఎలాంటి మాటలు లేకుండానే ఒకే చెప్పిందట. తనకు ఇప్పటికే రెండు భారీ హిట్స్ ఇచ్చిన దర్శకుడిని మళ్ళీ కథ అడగడం కరెక్ట్ కాదనే, పూజా ఇలా పూర్తి నమ్మకంతో మహేశ్ సరసన నటించడానికి సైన్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా పూజా లక్కీ హీరోయిన్ అని చెప్పాలి.