Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే రోజుకో కొత్త ప్రాజెక్ట్ కమిటవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఎప్పుడో కమిటై డేట్స్ ఇచ్చిన ప్రాజెక్ట్‌కు నో చెప్పి దాని ప్లేస్‌లో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ – మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన మోస్ట్ అవైటెడ్ మూవీ భవదీయుడు భగత్‌సింగ్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుందని స్వయంగా మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ ప్రాజెక్ట్ డిలే అవుతుండటంతో పవన్ సినిమాకు నో చెప్పి పూరి జగన్నాథ్ సినిమాకు ఒకే చెప్పిందని టాక్ వినిపించింది.
ఇది నజమా కాదా తెలియదు గానీ, పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ సినిమా జనగణమన మాత్రం అమ్మడు కమిటైంది. ప్రస్తుతం షూటింగ్‌లో కూడా పాల్గొంటోంది. అలాగే, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ – టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేస్ కలిసి నటిస్తున్న కభీ ఈద్ కభీ దీవాళీ సినిమాలోనూ నటిస్తుండగా, ఈ సినిమా షూటింగ్ కూడా ఇదే నెలలో మొదలవనుంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్‌ను పూజా పార్ట్ వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని ప్లాన్ చేసుకుంది. అలాగే, మరో హిందీ సినిమాలో కూడా నటించనున్న పూజా టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ కూడా చేయాల్సింది ఉంది.

Pooja Hegde: మహేశ్ సినిమా పాన్ ఇండియా కాదు..?
అదే సూపర్ స్టార్ మహేశ్ బాబు – స్టార్ డైరెక్టర్ త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన సినిమా. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌లో పూజాను హీరోయిన్‌గా మేకర్స్ కన్‌ఫర్మ్ చేశారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాను వదిలేసిందనే టాక్ మొదలైంది. దీనికి కారణం కన్నడ రాకింగ్ స్టార్ రాఖీభాయ్ యష్ సరసన సినిమా అవకాశం రావడమేనని తెలుస్తోంది. ఇది పాన్ ఇండియా లెవల్‌లో రూపొందే సినిమా గనక మహేశ్ సినిమా పాన్ ఇండియా కాదు గనకనే అటువైపు ఇంట్రెస్ట్ చూపించని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. మరి నిజంగా మహేశ్ సినిమా వదిలేసి యష్ సినిమా ఒప్పుకుందేమో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే.