Pooja Hegde: పూజా హెగ్డేకు వరుసగా ఫ్లాప్స్ వస్తున్నా కూడా క్రేజ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గడం లేదు. సినిమాలే కాదు, స్పెషల్ సాంగ్స్ చేసేందుకు కూడా చక చకా సైన్ చేస్తోంది. ఇటీవలే వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఎఫ్ 3 సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి బాగానే ఊపేసింది. ఈ సాంగ్‌ను థియేటర్స్‌లో ఆడియన్స్ బాగానే ఎంజాయ్ చేశారు. దాంతో రెండు ఐటెం సాంగ్స్ పూజాకు మంచి పేరు తెచ్చి ఏకంగా బాలీవుడ్‌లో కూడా ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ దక్కడానికి కారణం అయ్యాయి.
ఇప్పటికే హిందీలో పూజా హెగ్డే సల్మాన్ సరసన కభీ ఈద్ కబీ దివాళీ అనే సినిమా చేస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ ఇందులో మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే సర్కస్ అనే సినిమాలోనూ నటిస్తోంది. అయితే, తెలుగు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ హిందీలో రణ్‌బీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమాను చేస్తున్నారు. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్. ఈ సినిమాలోనే అమ్మడు ఐటెం సాంగ్ కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇదిలా ఉంటే తెలుగులో ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాను వదులుకున్నట్టు సమాచారం.

Pooja Hegde: హరీష్ శంకర్ లేదా ఇటు పూజా క్లారిటీ ఇస్తేగానీ నమ్మలేము.
తనకి తెలుగులో మళ్ళీ ఛాన్స్ ఇచ్చి ఇంతటి క్రేజ్ తెచ్చుకోవడానికి కారణం అయిన హరీష్ శంకర్ ..పవన్ కళ్యాణ్ హీరోగా భవదీయుడు భగత్‌సింగ్ సినిమాను చేయనున్నారు. ఈ సినిమాలో ముందునుంచి హీరోయిన్‌గా పూజాను ఫిక్సైయ్యారు. ఆల్రెడీ హరీష్ కూడా వెల్లడించాడు. అయితే, ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో అర్థం కావడం లేదు. త్వరలో మహేశ్ – త్రివిక్రమ్ సినిమా షూట్ స్టార్ట్ కాబోతోంది. ఇందులో హీరోయిన్ పూజా హెగ్డే. అలాగే, ఈ వారంలో సల్మాన్ సినిమా షూటింగ్ మొదలవబోతోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ కోసం పూజా డేట్స్ ఇచ్చిది. ఇప్పుడు పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండల జనగణమన కూడా పూజా కమిటైందట. పవన్ సినిమా డిలే అవుతుండటంతో ఆ డేట్స్ జనగణమనకు కేటాయించాలని డిసైడయి పవన్సినిమాను వదులుకుందని టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో అటు హరీష్ శంకర్ లేదా ఇటు పూజా క్లారిటీ ఇస్తేగానీ నమ్మలేము.