Pooja hegde : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి ‘సాహో’ సినిమా వచ్చి రెండేళ్ళు దాటిపోయిన సంగతి తెలిసిందే. ‘సాహో’ సమయంలో ప్రభాస్ అభిమానులకి ప్రామిస్ చేశాడు. ఇప్పటి నుంచి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా సినిమాను రిలీజ్ చేస్తానని. దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ అందరు ..ఆయన నుంచి కనీసం ఏడాదికి ఓ సినిమా అయినా వస్తుందేమో అని ఆశపడ్డారు. కానీ కరోనా కారణం గా ఆయన నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమాలలో ఒకటైన ‘రాధే శ్యామ్’ అంతకంతా ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైనా కూడా టైటిల్ గానీ, ప్రభాస్ లుక్ గానీ రిలీజ్ చేయకపోవడంతో అందరు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దాంతో ఫ్యాన్స్ ను కూల్ చేయడానికి ప్రభాస్ టీం టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చింది.

ఇక అప్పటి నుంచి ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వాచ్చారు. కానీ మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ కారణంగా ఏకంగా రిలీజే ఆగిపోయింది. నాలుగు ప్రధాన సౌత్ భాషలతో పాటు చైనా, జపాన్ లలో ‘రాధే శ్యామ్’ మూవీ అత్యంత భారీ స్థాయిలో జూలై 30న రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ మేరకు అధికారక ప్రకటన ఇస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది చిత్ర బృందం. కానీ సెకండ్ వేవ్ లాక్ డౌన్ వల్ల ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. దాంతో అసలు ‘రాధే శ్యామ్’ ఈ ఏడాదైనా రిలీజ్ అవుతుందా..! అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజాహెగ్డే ప్రభాస్ ఫ్యాన్స్ కి హింట్ ఇచ్చారు. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడికల్ రొమాంటిక్ మూవీ కి సంబంధించిన సీన్స్, ఒక సాంగ్ షూట్ 7 నుంచి 10 రోజుల్లో పూర్తి కానుందట. త్వరలో దీని షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నట్టు తెలిపారు పూజా హెగ్డే.

Pooja hegde : ప్రభాస్ సోదరి ప్రశీద ‘రాధే శ్యామ్’తో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుండటం విశేషం.

అంతేకాదు పరిస్థితులు పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి వచ్చిన తరువాతే నిర్మాతలు సినిమా రిలీజ్ డేట్ పై ఒక నిర్ణయం తీసుకుంటారని క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ – పూజా హెగ్డేలపై బాలీవుడ్ మేకర్స్ సూచన మేరకు ఓ సాంగ్, అలాగే కొన్ని పెండింగ్ సీన్స్ కోసం 10రోజుల చిన్న షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇక ఇప్పటి వరకు పూర్తయిన షూటింగ్ కి సంబంధించిన వీఎఫెక్స్ వర్క్ కూడా చిత్ర బృందం పూర్తి చేసింది.

దేవదాసు – పార్వతీ, లైలా – మజ్ఞు, సలీమ్ – అనార్కలీల గొప్ప ప్రేమ కావ్యంలా ‘రాధే శ్యామ్’లో విక్రమాదిత్య – ప్రేరణ ప్రేమ కథ కూడా ఉంటుందని ఇదివరుకే దర్శకుడు హింట్ ఇచ్చాడు. ఇక తాజాగా పూజా హెగ్డే ఇచ్చిన హింట్ తో అక్టోబర్ నెలలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ‘రాధే శ్యామ్’ పోటీ పడే అవకాశం ఉందని తెలుస్తోంది. గోపీకృష్ణ మూవిస్, టీ – సిరీస్ బ్యానర్స్‌లో కృష్ణం రాజు, భూషన్ కుమార్ సమర్పిస్తుండగా, యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో 250 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించి, వంశీ – ప్రమోద్ – ప్రశీద నిర్మిస్తున్నారు. ప్రభాస్ సోదరి ప్రశీద ‘రాధే శ్యామ్’తో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుండటం విశేషం.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 24, 2021 at 10:41 ఉద.