Pooja Hegde : పూజా హెగ్డేకు ఊహించని గిఫ్ట్.. అక్కడ కూడా అవకాశం.. ఏం లక్కు రా బాబు!

Akashavani

Pooja Hegde : టాలీవుడ్ బుట్ట బొమ్మగా నిలిచిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే గురించి తెలియని వారెవ్వరూ లేరు. ప్రస్తుతం ఈ అమ్మడి క్రేజ్ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది. చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంది.

ఇక తన అందంతో ఎంతోమంది కుర్రాళ్లను ఆకట్టుకొని వారిని అభిమానులుగా మార్చుకుంది. ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా కనిపిస్తుంది. తొలిసారిగా 2010లో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. 2014లో ముకుంద సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. కెరీర్ మొదట్లో వరుస ఫ్లాప్ లను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.

ఇక నిజానికి దర్శకనిర్మాతలు కూడా పూజా హెగ్డే ను ఎంతో సెంటిమెంట్ గా భావిస్తారు. అలా వైకుంఠపురంలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బుట్ట బొమ్మ.. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో బాగా బిజీగా ఉంది. పైగా పాన్ ఇండియా మూవీ లో అవకాశాలు అందుకోగా ఇటీవలే వరుసగా రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు ప్లాప్ అందుకుంది.

Pooja Hegde : పూజా హెగ్డేకు ఊహించని గిఫ్ట్.. అక్కడ కూడా అవకాశం.. ఏం లక్కు రా బాబు!
Pooja Hegde : పూజా హెగ్డేకు ఊహించని గిఫ్ట్.. అక్కడ కూడా అవకాశం.. ఏం లక్కు రా బాబు!

Pooja Hegde : అందులో అవకాశం అందుకున్న పూజా హెగ్డే..

ఇక వరుసగా ఫ్లాపులు అందుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో మాత్రం మరో రెండు సినిమాల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మకు ఊహించని గిఫ్ట్ వచ్చిందనే చెప్పాలి. ఇంతకీ అదేంటంటే.. తనకు 75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఆహ్వానం వచ్చింది. మే 17వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కు అవకాశం రాగా అందులో పూజ హెగ్డే పేరు ఉండటం కూడా విశేషమని చెప్పాలి. మొత్తానికి పూజ హెగ్డేకు ఈ అవకాశం రావడంతో అందరూ ఈ ముద్దుగుమ్మకు ఏం లక్కుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -