Pooja Hegde: టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్టబొమ్మగా అందరినీ తన వైపుకు మలుపుకున్న బ్యూటీ పూజా హెగ్డే. తన అందాలతో అందర్నీ ఆకట్టుకుంది. ఇండస్ట్రీకి అడుగుపెట్టిన కొంత కాలానికే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా పేరు సంపాదించుకుంది.
ముకుంద సినిమాతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజ.. ఆ తర్వాత నాగచైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది. దీంతో ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. చాలావరకు స్టార్ హీరోల సరసన నటించింది. గతంలో ఈ బ్యూటీ అడుగుపెట్టడంతో వరుస సక్సెస్ లు రావడంతో దీంతో దర్శక నిర్మాతలు కూడా ఈ బ్యూటీని సెంటిమెంట్ గా భావించారు. అలా కొన్ని రోజులు టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజ హెగ్డే హవా నడిచింది.
ఇక అలా వైకుంఠపురంలో సినిమా సక్సెస్ తర్వాత పూజకు అంతగా కలిసి రావడం లేదు. తను నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు వరుసగా ప్లాఫ్ లు అందుకోవడంతో.. ముద్దుగుమ్మ ఖాతాలో హిట్ అనేది సరిగ్గా లేకపోయింది. దీంతో ఐరన్ లెగ్ అని ట్యాగ్ కూడా అందుకుంది. దీంతో బాలీవుడ్ లో అడుగు పెట్టగా అక్కడ కూడా ఫ్లాప్ అందుకుంది ఈ బ్యూటీ.

Pooja Hegde: కలిసిరాని పరిస్థితిలో పూజ హెగ్డే..
హిందీలో ఆమె నటించిన సర్కస్ సినిమా నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. స్టార్ హీరో రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా నిన్న విడుదల కాగా సక్సెస్ కాలేక పోయింది. కేవలం రూ.7.50 కోట్లు మాత్రమే సొంతం చేసుకుంది. దీంతో పూజ హెగ్డే కు ఈ సినిమా కూడా ప్లాఫ్ అవడంతో ఆ తర్వాత అవకాశాలు వస్తాయా రావా అన్న ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి. నిజానికి ఈ మధ్య పూజ హెగ్డే పరిస్థితి మాత్రం చాలా దారుణంగా మారింది అని చెప్పవచ్చు.