Pooja Mishra ఆ హీరోయిన్ తండ్రి నాకు చేతబడి చేయించి కెరియర్ నాశనం చేశాడు …. అందుకే పెళ్లి కూడా….

Joythi R

Pooja Mishra బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో నేపోటీజం అనే పదం ఎక్కువగా వినబడుతోంది. దీంతో ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరియు ఇతర సెలబ్రిటీలు కూడా ఈ నేపోటీజంపై స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా బాలీవుడ్ లో పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను బాగా అలరించిన ప్రముఖ బాలీవుడ్ నటి పూజా మిశ్రా బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి నేపోటీజం పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇందులో భాగంగా కొందరు స్టార్ సెలబ్రిటీలు తమ వారసులను సినిమా ఇండస్ట్రీలో ప్రమోట్ చేసేందుకు ఏకంగా ఇతరుల సినీ కెరీర్ ని నాశనం చేస్తున్నారని అంతేకాకుండా అవకాశాలు రాకుండా కూడా చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. అయితే బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో కొన్ని వందల చిత్రాలలో నటించి ఎన్నో అవార్డులు అందుకున్న టువంటి ప్రముఖ సినీ నటుడు మరియు రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హా తన కూతురు సోనాక్షి సిన్హా ని స్టార్ హీరోయిన్ చేసేందుకు తనకి తీరని అన్యాయం చేశాడని చెప్పుకొచ్చింది. అలాగే తన తండ్రి శత్రుఘ్న సిన్హా కి వ్యాపారం పరంగా ఎంతో మేలు చేశాడని కానీ శత్రుఘ్న సిన్హా మాత్రం అందుకు ప్రతిఫలంగా ఏమాత్రం కృతజ్ఞతలు లేకుండా నా సినీ కెరీర్ ని నాశనం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.

అంతటితో ఆగకుండా తనపై చేతబడి చేయించి అశ్లీల చిత్రాల వ్యవహారంలో పోలీసులకు చిక్కేలా చేశారని దాంతో తన కెరీర్ను పూర్తిగా నాశనం అయిందని వాపోయింది. దీంతో నటి పూజ మిశ్రా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ దుమారం రేపుతున్నాయి. అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి పూజ మిశ్రా కేవలం చర్మం మాత్రమే కాకుండా మోడలింగ్ రంగంలో కూడా కొంతకాలం పాటు బాగానే రాణించింది కానీ దురదృష్టవశాత్తూ అశ్లీల చిత్రాల కేసు వ్యవహారంలో పోలీసులకు చిక్కడంతో ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు కరువయ్యాయి. కానీ నటి సోనాక్షి సిన్హా మాత్రం బాలీవుడ్లో ప్రస్తుతం తిరుగులేని స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.

- Advertisement -