Poonam Kaur : తెలుగులో ప్రస్తుతం బ్యూటిఫుల్ వెటరన్ హీరోయిన్ పూనమ్ కౌర్ నాతిచరామి అనే చిత్రంలో హీరోయిన్ గా నటించిన సంగతి అందరికి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి నూతన దర్శకుడు నాగు గవర దర్శకత్వం వహించగా తెలుగు ప్రముఖ హీరోలైన అరవింద్ కృష్ణ మరియు సందేశ్ బురి తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. అలాగే 24 ఫ్రేమ్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత వైష్ణవి. కే నిర్మించింది. కాగా ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్ పూనమ్ కౌర్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని నాతిచరామి చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.
ఇందులో భాగంగా నాతిచరామి చిత్రం రియల్ లైఫ్ ఇన్సిడెంట్ల ఆధారంగా తెరకెక్కించామని కచ్చితంగా ప్రేక్షకులకీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే ఈ చిత్రంలో తాను నటించిన శ్రీలత క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని ఇంతకుముందు ఎప్పుడూ తనని చూడని పాత్రలో ప్రేక్షకులను చూడబోతున్నారని చెప్పుకొచ్చింది. ఇక సినిమా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి స్పందిస్తూ తాను అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కొంతమంది దర్శక నిర్మాతలు నువ్వు హీరోయిన్ గా పనికి రావని మొహం మీద చెప్పేవాళ్లని తెలిపింది.
అంతేకాకుండా మరికొందరైతే సినిమా అవకాశాల పేరుతో తనని లొంగదీసుకోవాలని కుడా ప్రయత్నించారని కానీ తాను మాత్రం ఎప్పుడూ కూడా కష్టపడి పని చేయడానికి ఇష్టపడ్డానని తెలిపింది. ఇక టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తన గురించి వినిపించిన రూమర్ల గురించి స్పందిస్తూ తన ప్రమేయం లేకుండా కొంతమంది సృష్టించిన పుకార్లను మరియు రూమర్లను తను పెద్దగా పట్టించుకోనని తెలిపింది. అయితే ఇప్పటికే చాలామంది దర్శక నిర్మాతలు తనకి స్టోరీలు చెప్పడానికి తరచూ తన ఇంటికి వచ్చి వెళుతుంటారని అలాగే తన అభిమానుల కూడా తన నుంచి మంచి హిట్ చిత్రాన్ని ఆశిస్తున్నారని అందువల్లనే నాతిచరామి చిత్రంలో నటించానని తెలిపింది.
అయితే ఆ మధ్య తన పేరును కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించిన విషయం గురించి స్పందిస్తూ నిజానిజాలు తెలుసుకోకుండా చేసేటువంటి దుష్ప్రచారాలవల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం ఉండదని స్పష్టం చేసింది. అంతేకాకుండా తానేమిటో తన ఫ్యాన్స్ కి బాగా తెలుసని అలాగే తన అభిమానులను అలరించేందుకు కష్టపడి పని చేయడానికి ఎప్పుడూ కూడా వెనకాడని కూడా చెప్పుకొచ్చింది. అయితే ఈ నాతిచరామి చిత్రం ట్రైలర్ 2 వారాల క్రితం విడుదల కాగా మంచి స్పందన లభించింది. కాగా తొందర్లోనే ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.