Poonam kaur: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా గుర్తింపు పొందిన పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి గుర్తింపు పొందిన పూనమ్ కౌర్ స్టార్ హీరోయిన్ గా మాత్రం రాణించలేకపోయింది. ఇలా కెరియర్ ప్రారంభంలో తెలుగు తమిళ్ భాషలలో కొన్ని సినిమాలలో నటించిన పూనమ్ కి ఆ తర్వాత అవకాశాలు లభించకపోవడంతో ఆమె ఇండస్ట్రీకి దూరమయ్యింది. అయితే సినిమా అవకాశాలు రానప్పటికీ ఆమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది.
అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూనమ్ తన వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో పంచుకుంటూ అప్పుడప్పుడు తన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా సినీ, రాజకీయ ప్రముఖుల గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే వివాదాస్పద పోస్టులు సంచలనంగా మారుతూ ఉంటాయి. ఇలా సోషల్ మీడియాలో పూనమ్ కౌర్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.

Poonam kaur: నీతులు చెప్పేవారు గురువు కాదు…
ఈ క్రమంలో ఈ అమ్మడు షేర్ చేసిన మరొక పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. తాజాగా గురు పౌర్ణమి సందర్భంగా పూనం కౌర్ సోషల్ మీడియాలో ఒక స్టోరీ పోస్ట్ షేర్ చేసింది. ఈ క్రమంలో “ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను. గురువును టామ్, డిక్ అని పిలవద్దని. నీతులు చెప్పి స్టేజ్ మీద జీవితాలతో ఆడుకునేవాడు గురువు కాదు. మీ జీవితానికి దారి చూపించేవారు గురువు అవుతారు” అంటూ రాసుకొచ్చింది. దీంతో పూనమ్ కౌర్ షేర్ చేసిన ఈ ఇన్‌స్టా స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.