Poonam Kaur సడెన్ గా ఇద్దరి పిల్లలతో కనిపించిన తెలుగు హీరోయిన్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు….

Joythi R

Poonam Kaur మాములుగా సినీ సెలెబ్స్ వ్యక్తిగత జీవితాలపై నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే సినీ సెలెబ్రెటీల సోషల్ మీడియా ఖాతాలకు లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉంటారు. దీంతో చాలా మంది సెలెబ్రెటీలు కూడా అప్పుడుడప్పు తమకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వంటివి షేర్ చేస్తూ తమ ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ని పెంచుకుంటూ ఉంటారు. కానీ క్రమంలో ఎలాంటి చిన్నపాటి తప్పు జరిగినా ట్రోలింగ్ మాత్రం తప్పదు. కానీ ఈ మధ్య కాలంలో కొందరు ఆకతాయిలు సినీ సెలెబ్రెటీలు ఎలాంటి విషయాలను షేర్ చేసినా వక్రీకరిస్తూ టప్పుడే ప్రచారాలు చేస్తూ నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. కాగా తాజాగా తెలుగు ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి కొందరు ఆకతాయిలు తప్పుగా ట్రోల్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే తాజాగా నటి పూనమ్ కౌర్ తన అధికారిక పేస్ బుక్ ఖాతా ద్వారా ఇద్దరు చిన్నపిల్లలతో కలసి దిగిన ఫొటోలను షేర్ చేసింది. దీంతో కొందరు పూనమ్ కౌర్ అభిమానులు ఈ ఫోటోలపై స్పందిస్తూ పిల్లలు చాలా క్యూట్ గా ఉన్ననారని కామెంట్లు చేస్తున్నారు. కానీ మరికొందరు ఆకతాయిలు మాత్రం ఈ ఫోటోలపై నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరు మాత్రం ఈ ఫోటోలపై రాజకీయ లబ్దికోసం తప్పుడు కామెంట్లు చేస్తున్నారు. ఇందులో కొందరు అధికార పార్టీ ని సపోర్ట్ చేస్తున్న నెటిజన్లు ఏకంగా పూనమ్ కౌర్ కి టాలీవుడ్ సినీ పరిశ్రమకి చెందిన నటుడో ఎఫైర్ ఉందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఏకంగా పూనమ్ కౌర్ ఎత్తుకున్న చిన్నపిల్లలు ఏకంగా ఆ స్టార్ హీరో పోలికలు కలిగి ఉన్నారంటూ అసభ్యకరం గా కామెంట్లు చేస్తున్నారు. ఇంత జరిగాక ఆ స్టార్ హీరో అభిమానులు కూడా ఏకంగా తమదైన శైలిలో రిప్లై ఇస్తున్నారు. ఇందులో నిజానిజాలు తెసులుకోకుండా ఒక మహిళపై తప్పుడు కామెంట్లు చెయ్యడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమ ఇళ్లలో కూడా ఆడవాళ్లు, చిన్న పిల్లలు ఉంటారని కాబట్టి ఒకరిపై ఇలా తప్పుడు కామెంట్లు చేసేముందు వారి గురించి కూడా ఒకసారి ఆలోచించాలని చాలా సున్నితంగా రిప్లై ఇస్తున్నారు.

Poonam Kaur సడెన్ గా ఇద్దరి పిల్లలతో కనిపించిన తెలుగు హీరోయిన్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు....
Poonam Kaur సడెన్ గా ఇద్దరి పిల్లలతో కనిపించిన తెలుగు హీరోయిన్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు….

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే నటి పూనమ్ కౌర్ తెలుఫులో నాతి చరామి అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించింది, కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కాగా ఈ చిత్రంలో యంగ్ హీరో అరవింద్ కృష్ణ మరో ప్రధాన పాత్రలో నటించగా నూతన డైరెక్టర్ నాగు గవర దర్శకత్వం వహించాడు. దీంతో ఈచిత్రం పై ఆశలు పెట్టుకున్న నటి పూనమ్ కౌర్ ఆశలు అడియాశలు అయ్యాయి. ఐతే ఈ మధ్యకాలంలో నటి పూనమ్ కౌర్ రాజకీయాలపై ద్రుష్టి సారిస్తున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరి సినిమాల్లో ఎలాగో నిలదొక్కుకోలేకపోయిన ఈ బ్యూటీ రాజకీయాల్లో ఎలా రాణిస్తుందో చూడాలి.

- Advertisement -