Poorna: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుడిగాలి సుధీర్ అనే పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ ద్వారా బుల్లి తెరపై మంచి పేరు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్.. ఆ షో తోనే బుల్లితెర ప్రేక్షకులను మరో లెవెల్లో ఆకట్టుకున్నాడు. ఇక్కడ సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ వంటి సినిమాలో హీరోగా నటించి సిల్వర్ స్క్రీన్పై హడావిడి చేస్తున్నాడు సుధీర్.
సుధీర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఓ వెలుగు వెలుగుతున్నాడు. సుధీర్ ని ఇన్స్పిరేషన్గా తీసుకొని బుల్లితెర జబర్దస్త్ కు వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ఇక సుధీర్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు నెటిజన్ల తో ఎదో ఒక కంటెంట్ తో ముచ్చట పెడుతూనే ఉంటాడు.
ఇక త్రీ మంకీస్ తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చిన సుధీర్ ప్రస్తుతం కాలింగ్ సహస్ర అనే క్రైమ్ మూవీలో నటిస్తున్నాడు. ఈ స్టోరీ ఒక ప్రత్యేకమైన క్రైమ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ సినిమా టీజర్ ని శుక్రవారం నాడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. ఇక ఈ మూవీలో క్రైమ్ తో పాటు ఒక లవ్ యాంగిల్ కూడా ఉంది.

Poorna: పూర్ణ.. నేను మొదటినుంచి చెబుతున్నాను అంటూ సుధీర్ పై చేసిన వ్యాఖ్యలు ఇవే..!
ఇక ఈ టీజర్ చూసిన చాలామంది సెలబ్రెటీలు సుధీర్ ని అనేక రకాలుగా మెచ్చుకున్నారు. ఇదే క్రమంలో పూర్ణ కూడా సుధీర్ ని మెచ్చుకుంది. నువ్వు ఇక్కడ ఉండాల్సింది కాదు వెండితెర పై స్టార్ హీరో గా ఉండాలి. నేను నీకు ఫస్ట్ నుంచి చెబుతూనే ఉన్నాను. యు ఆర్ ద హీరో మెటీరియల్.. అంటూ మరికొన్ని మాటలతో సుధీర్ ని పొగుడుతూ వచ్చింది పూర్ణ. ఇక సుధీర్ ఈ సినిమాతో ప్రేక్షకుల్ని ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి.