Poorna: తెలుగు బుల్లితెర ప్రసారమవుతున్న కార్యక్రమాలకు విపరీతమైన ప్రేక్షకాదరణ ఉంది.ఇక ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో మంది కమెడియన్స్ తమ అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ద్వారా రోజురోజుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమాలకు వెండితెర సెలబ్రిటీలు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం గురించి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి సుడిగాలి సుధీర్ యాంకర్ గా వ్యవహరించగా ఇంద్రజ జడ్జీ స్థానంలో ఉన్నారు.
ప్రతివారం ఈ కార్యక్రమానికి ఎవరో ఒకరు అతిథులుగా వస్తుంటారు. ఇకపోతే తాజాగా ఈ వారం ప్రసార కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరోయిన్ పూర్ణ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదివరకే ఈమె ఈటీవీలో ప్రసారమైన ఢీఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఓ రేంజ్ లో పాపులర్ అయ్యారు.ఇలా ఈ కార్యక్రమానికి పూర్ణ ఎంట్రీ ఇవ్వగానే హైపర్ ఆది మాట్లాడుతూ పూర్ణ గారు హగ్ కావాలని అడిగారు.

Poorna: ఆగ్రహం వ్యక్తం చేసిన పూర్ణ…
ఈ మాటకు పూర్ణ సమాధానం చెబుతూ ఢీ కార్యక్రమంలో హగ్గులు ఇవ్వలేక అది మానేశాను ఇక్కడ కూడా అంటూ తన పై సెటైర్ వేశారు. ఇలా ఈ కార్యక్రమం ఎంతో సరదాగా సాగుతున్న సమయంలో ఒక పరిణామం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే వేదికపై పూర్ణ మాట్లాడుతూ ఉండగా కమెడియన్ ఇమ్మానియేల్ హీరోయిన్ పూర్ణతో అసభ్యకరంగా ప్రవర్తించిన తనని తాకాడు.దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన పూర్ణ వేదికపైనే నన్ను తాకడానికి నువ్వు ఎవరు? నీకు ఎంత ధైర్యం అంటూ పెద్ద ఎత్తున తన పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా వేదికపై పూర్ణ ఇమ్మానియేల్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పలువురు ఈ విషయంపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది వరకే పూర్ణ ఎంతోమంది కంటెస్టెంట్ లకు హగ్ ఇవ్వడం బుగ్గ కొరకడం వంటివి చేశారు. అయితే ఇలా ఇమ్మానియేల్ పై ఈమె ఆగ్రహం వ్యక్తం చేయడంతో పలువురు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.