Poorna పలు టాలీవుడ్ చిత్రాలలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన తెలుగు బ్యూటిఫుల్ హీరోయిన్ పూర్ణ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి పూర్ణ వచ్చి రావడంతోనే హీరోయిన్ గా తన ప్రతిభ నిరూపించుకోవడంతో కొంతకాలం పాటు బాగానే రాణించింది. కానీ క్రమక్రమంగా తన చిత్రాల కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో వరుస డిజాస్టర్లను ఎదుర్కొంది. దీంతో ప్రస్తుతం నటి పూర్ణ కి హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు లేవు. అయినప్పటికీ నటి పూర్ణ మాత్రం గతంలో బాగా పాపులర్ అయినటువంటి ఢీ డాన్స్ కాంపిటీషన్ షో ద్వారా కొంతకాలం పాటు తన అభిమానులకి అందుబాటులో ఉంది. కానీ ఆ తర్వాత ఢీ షో నుంచి వెళ్ళిపోవడంతో ప్రస్తుతం పలు రకాల షోరూం బాగానే ఆకట్టుకుంటుంది.
అయితే తాజాగా నటి పూర్ణ గురించి ఓ వార్త గత రెండు రోజులుగా సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే నటి పూర్ణ పెళ్లి క్యాన్సిల్ అయిందని టాలివుడ్ సినిమా ఇండస్ట్రీలో కోడై కూస్తోంది. ఈ క్రమంలో మరికొందరైతే ఏకంగా నటి పూర్ణ కి తెలుగు ప్రముఖ డైరెక్టర్ తో లవ్ ఎఫైర్ ఉందని అందువలనే ఈ అమ్మడుతో తనకు కాబోయే భర్త పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడని చర్చించుకుంటున్నారు. దీంతో ఎలా వచ్చిందో ఏమో గానీ ఈ వార్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో కొంతమంది నటి పూర్ణ కి సంబంధం లేనటువంటి వార్తలతో లింకులు పెట్టిమరీ ప్రచారాలు చేస్తున్నారు. అయితే నటి పూర్ణ పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఇంతగా ప్రచారాలు జరుగుతున్నప్పటికీ నటి పూర్ణ మాత్రం ఇప్పటివరకూ ఈ పెళ్లి క్యాన్సిల్ వ్యవహారం పై మాత్రం స్పందించడం లేదు. దీంతో మరిన్ని అనుమానాలకు తావిస్తుంది ఈ అంశం…
అయితే ఆ మధ్య నటి పూర్ణ జెబిఎస్ గ్రూప్ కంపెనీ ఫౌండర్ షానిద్ ఆసిఫ్ ఆలీ తో ప్రేమలో పడడంతో ఇరువురి పెద్దల సంస్ఖంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అలాగే త్వరలోనే వీరిద్దరూ పెళ్ళిచేసుకోబోతున్నాని అధికారికంగా సోషల్ మీడియా మాధ్యమాలు ద్వారా ప్రకటించారు కూడా.. మళ్లీ ఇప్పుడు ఈ పెళ్లి క్యాన్సిల్ వార్తలు వినిపిస్తున్నాయి. మరి నటి పూర్ణ ఈ విషయం పై ఎలా స్పందిస్తుందో చూడాలి…..