Posani Krishna Murali: తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి పోసాని కృష్ణమురళి గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈయన తెలుగు ఫిలిం చైర్పర్సన్ గాబాధ్యతలు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలుపుతూ పలు సందర్భాలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే పోసాని కృష్ణమురళి తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ సంచలనగా మారాయి.
ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ తాను తన జీవితంలో చాలా గొప్పగా బతికానని తెలిపారు. అందుకే నేను చనిపోతే నా శవాన్ని ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎవరు చూడకూడదని ఈయన తెలిపారు. నేను ఈ విషయం గురించి నా పిల్లలకు నా భార్యకు ముందుగానే చెప్పి వారిని సిద్ధం చేశానని తెలిపారు. అదే విధంగా నేను చనిపోయిన తర్వాత ఇండస్ట్రీ వారు నా దగ్గరికి వచ్చి సింపతి చూపించకూడదని ఈయన తెలియజేశారు. అదేవిధంగా నేను చనిపోయిన సమయంలో నా భార్య కూడా ఏడవడానికి వీలులేదని ఈ విషయం తనకి చెప్పి తనని ప్రిపేర్ చేసి పెట్టానని తెలిపారు.
Posani Krishna Murali: నా భార్యను ఏడవద్దని చెప్పాను….
నేను చనిపోయిన తర్వాత నా భార్య నన్ను చూసి ఏడవకూడదు ఆమె నాతో గడిపిన క్షణాలను మాత్రమే గుర్తు చేసుకోవాలి.ఇక భవిష్యత్తులో ఎవరు ఎలా మారిపోతారో తెలియదు నా పిల్లలు నేను చనిపోయిన తర్వాత నా భార్యను వదిలి ఏ ఫారిన్ కు వెళ్లి సెటిల్ కావచ్చు అలాంటి సమయంలో నాకు తోడు ఎవరూ లేరు నేనేం చేయాలి అనే ఆలోచన నా భార్యకు రాకూడదని ఆమె పేరిట 50 కోట్ల రూపాయల ఆస్తులను రాస్తే పెట్టానని ఆమె ఏ పని చేయకపోయినా నెలకు 9 లక్షల రూపాయల సంపాదన వస్తుందని పోసాని తెలిపారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన తను చనిపోతే ఇండస్ట్రీలో ఎవరు చూడకూడదు అంటూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.