Prabhas – Anushka: ప్రభాస్, అనుష్క మధ్య మళ్ళీ ప్రేమ మొదలైందా.. నిజమేనా?

Akashavani

Prabhas – Anushka: టాలీవుడ్ ప్రేక్షకులకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఆ తర్వాత పలు సినిమాలలో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. పైగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ టాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.

ఇక దర్శకుడు ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తో ప్రభాస్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో ఎగబాకింది. ప్రభాస్ యాక్టింగ్ కు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఫిదా అవుతున్నారు. ఇక అదే జోరులో బాహుబలి2 ను కూడా భారీ స్థాయిలో సక్సెస్ అందించారు బీ టౌన్ ప్రేక్షకులు.

ఇదంతా పక్కన పెడితే ప్రభాస్, అనుష్కల కాంబినేషన్లో వచ్చే సినిమా అంటే ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూడాల్సిందే. బిల్లా, మిర్చి వంటి సినిమాలలో వీరిరువురు కాంబో మరో స్థాయిలో ఉందని అనిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో వీరిద్దరి కాంబోలో మరొక కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

Prabhas - Anushka: ప్రభాస్, అనుష్క మధ్య మళ్ళీ ప్రేమ మొదలైందా.. నిజమేనా?
Prabhas – Anushka: ప్రభాస్, అనుష్క మధ్య మళ్ళీ ప్రేమ మొదలైందా.. నిజమేనా?

Prabhas – Anushka: ప్రభాస్, అనుష్క లు మళ్ళీ కలవబోతున్నారు అని చెప్పడానికి కారణం ఇదే!

అదేమిటంటే.. మారుతి డైరెక్షన్లో వస్తున్న ప్రభాస్ హర్రర్ థ్రిల్లర్ సినిమాలో అనుష్క ను హీరోయిన్ గా ఎంచుకున్నాడట. మొత్తానికి ప్రభాస్, అనుష్క మధ్య మరోసారి ప్రేమ మొదలవ్వనున్నట్లు తెలుస్తుంది. మారుతీ ఇప్పటికే ఈ సినిమా గురించి పలుసార్లు సంప్రదింపులు కూడా జరిపారని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా గురించి అఫీషియల్ అప్ డేట్స్ కూడా ఇస్తారని తెలుస్తోంది.

ఇక ప్రభాస్ రాబోయే సినిమాల విషయానికొస్తే.. సలార్ సినిమా గురించి మనకు తెలుసు. అంతేకాకుండా స్పిరిట్ అనే సినిమాలో కూడా ప్రభాస్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఓం రౌట్ దర్శకత్వం వహిస్తున్న ఆది పురుష్ సినిమాలో కూడా బిజీగా ఉన్నాడు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

- Advertisement -