Prabhas – Balakrishna: నందమూరి బాలయ్య వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ షోకు తాజాగా ప్రభాస్ వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల కిందట ఈ షో కి ప్రభాస్ వచ్చినట్లు ప్రోమో విడుదల చేయగా అప్పటినుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ ఎపిసోడ్ కోసం బాగా ఎదురు చూశారు. దీంతో ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా కూడా చేశారు ఆహా. అయితే నిన్న ఒక ఎపిసోడ్ పూర్తి కాగా అందులో ప్రభాస్ చాలా విషయాలు పంచుకున్నాడు.
ఇక బాలయ్య అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పాడు ప్రభాస్. అయితే బాలయ్య.. నువ్వు ఎంతో మంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నావు. కానీ రాముడు సీతతోనే ఎందుకు ప్రేమలో పడ్డాడు అని అడగటంతో.. వెంటనే ప్రభాస్ స్పందించాడు. అది పాత వార్త అంటూ.. అవన్నీ కేవలం ప్రచారాలు మాత్రమే అని కృతి సనం ఇప్పటికే ఈ విషయాన్ని చెప్పేసింది కదా.. అయినా ఆ వార్తలు ఎటువంటి నిజం లేదు.. మీకు తెలియనిది ఏముంది..
ఏమీ లేకపోయినా ఇటువంటివి అనవసరంగా గోల చేస్తున్నారు అని క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత తన కెరీర్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు ప్రభాస్. తన కెరీర్లో మొదటి విజయాన్ని అందించిన సినిమా వర్షం అని.. ఆ సినిమా చేస్తున్నప్పుడే అది హిట్ అవుతుందని టీం మొత్తం అనుకున్నామని తెలిపాడు. ఇక మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా షూటింగ్ ఆరు నెలలోనే అయిపోయింది అని..
Prabhas – Balakrishna:
కానీ క్లైమాక్స్లో ఎమోషన్ సరిగ్గా రాలేదన్న ఉద్దేశంతో మరో మూడు నెలలు షూటింగ్ చేశామని అన్నాడు. ఇక చత్రపతి సినిమా చేస్తున్నప్పుడు రాజమౌళి గొప్పతనం అర్థమయిందని అప్పటినుంచి ఆయన మంచి ఫ్రెండ్ అయ్యాడని తెలిపాడు. ఇక షూటింగ్ సెట్ లో మొత్తం జనాలు ఉన్నారని.. వాళ్ళందర్నీ చూసి డైలాగ్ చెప్పడానికి సిగ్గుగా అనిపించింది అని కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు ప్రభాస్.