మానవత్వంలోనూ బాహుబలి.. క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమానికి ప్రభాస్ వీడియో కాల్

Balu

ప్రభాస్ మంచి నటుడే కాదు.. మంచి మానవత్వం ఉన్న మనిషి కూడా. స్నేహితులు, అభిమానులు ఎవరైనా సరే ఆపదలో ఉన్నారనే తెలిస్తే వెంటనే స్పందిస్తాడు. వీలైనంతవరకు సాయం చేస్తుంటాడు. అందుకే ఆయన్ను ప్రతిఒక్కరూ డార్లింగ్ అని పిలుస్తుంటారు. క్యాన్సర్ చికిత్స పొందుతున్న అభిమానికి ఫోన్ చేసి ఆమెను ఆశ్చర్యపరిచాడు టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్. శోభిత అనే అమ్మాయి కేన్సర్ బారినపడి హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇటీవల ఆమె వైద్యులతో మాట్లాడుతూ.. తాను ప్రభాస్ అభిమానినని, అతడితో మాట్లాడాలని ఉందని చెప్పింది. వైద్యుల ద్వారా విషయం తెలుసుకున్న ప్రభాస్ నిన్న వీడియో కాల్‌ చేసి శోభితతో మాట్లాడారు.

అభిమాన హీరో నుంచి ఫోన్ రావడంతో ఉబ్బితబ్బిబ్బయిన శోభిత తన బాధను మర్చిపోయి ప్రభాస్‌తో ఆనందంగా మాట్లాడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులకు ఫోన్ చేసి సర్‌ప్రైజ్ చేయడం ఇది మొదటిసారేం కాదు.. గతంలో చాలాసార్లు అభిమానులను పలుకరించారు.

సాహో సినిమా తర్వాత ప్రభాస్.. ఇప్పటివరకు స్క్రీన్ పై కనిపించకపోవడంతో.. ఆయన అభిమానులు… డార్లింగ్ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అలాగే ఈ మూవీస్‏కు సంబంధించిన క్రేజీ‏ అప్డేట్స్‏తో ఫ్యాన్స్‏ను ఖుషి చేస్తున్నాడు డార్లింగ్.. దక్షిణాది చిత్రపరిశ్రమలో కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్‏గా నటిస్తోంది.

- Advertisement -