Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి వారిలో నటి సమంత అలాగే నటుడు ప్రభాస్ వంటి వారు ఒకరు. ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత. ఈయన వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ తమన్నా కాజల్, త్రిష శ్రీయ శృతిహాసన్ వంటి హీరోయిన్లతో నటించారు.
ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లతో నటించిన ప్రభాస్ ఇప్పటివరకు సమంతతో ఒక సినిమా కూడా చేయలేదు ఇలా సమంతతో ప్రభాస్ సినిమాలు చేయకపోవడానికి గల కారణం ఏంటి అని పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. అయితే సమంత ప్రభాస్ కాంబినేషన్ లో ఇప్పటివరకు సినిమా రాకపోవడానికి కారణం వారు ఉన్నటువంటి హైట్ అని చెప్పాలి. ప్రభాస్ 6.2 అడుగుల ఎత్తు ఉండగా సమంత మాత్రం 5.2 ఉన్నారు ఇలా వీరిద్దరి మధ్య ఎత్తు భారీ తేడా ఉండడంతో వీరిద్దరూ కలిసి నటిస్తే చూడటానికి కూడా ఇబ్బందిగాఉంటుంది.
Prabhas: సమంత పొట్టిగా ఉండటమే కారణమా…
ఈ విధంగా వీరిద్దరి ఎత్తు మధ్య భారీగా వ్యత్యాసాలు రావడంతో ప్రభాస్ సమంత కాంబినేషన్లో ఇప్పటివరకు సినిమా రాలేదని చెప్పాలి. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండగా సమంత కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీ అయ్యారు. అయితే ఈమెకు మాయోసైటీస్ వ్యాధి రావడంతో ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం కొంత కాలం పాటు సినిమాలకు దూరం అయ్యారు. సెప్టెంబర్ 1న సమంత నటించిన ఖుషి సినిమా విడుదల కాగా సెప్టెంబర్ 27న ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.