Prabhas : నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో అన్‌స్టాఫబుల్ విత్ ఎన్‌బీకే సీజన్-2 టాక్ షో నడుస్తోన్న విషయం తెలిసిందే. ఇండియాలోని అన్ని టాక్ షోల కంటే అత్యధిక వ్యూస్‌తో బాలయ్య టాక్ షో దూసుకెళ్తుంది. టాలీవుడ్‌కు చెందిన హీరోలతో పాటు రాజకీయ నేతలు కూడా ఈ టాక్ షోలకు గెస్ట్ లుగా వస్తున్నారు. లేటెస్ట్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ షోకు గెస్ట్ గా వచ్చారు.
ప్రభాస్ ఇంటర్వ్యూను రెండు పార్ట్ లుగా విడుదల చేస్తున్నారు. తొలి పార్ట్ ఇప్పటికే విడుదల అవ్వగా.. రెండో పార్ట్ త్వరలో విడుదల కానుంది. తాజాగా రెండో పార్ట్ కు సంబంధించి ప్రొమోను ఆహా విడుదల చేసింది. ఈ ప్రొమో చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రభాష్ తో పాటు గోపీచంద్ కూడా ఈ షోకు వచ్చాడు. వారిద్దరితో కలిసి బాలయ్య చేసిన కామెడీ చాలా ఫన్నీగా ఉంది. ప్రభాస్, గోపీచంద్ పై బాలయ్య వేసిన జోకులు చాలా ఫన్నీగా ఉన్నాయి.
Prabhas :
ప్రభాస్, గోపీచంద్ లను సరదా ప్రశ్నలు బాలయ్య అడిగారు. ఈ ప్రశ్నులు నవ్వులు పూయిస్తున్నాయి. ప్రభాస్, గోపీచంద్ మధ్య ఫ్రెండ్ షిప్, వారి స్నేహంలో చోటుచేసుకున్న ఫన్నీ మూమెంట్స్ పై బాలయ్య ప్రశ్నలు అడిగాడు. జనవరి 6న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ సూపర్ హిట్ అయింది. ప్రభాష్ ఎపిసోడ్ పెట్టగానే ఆహా యాప్ ఒక్కసారిగా క్రాష్ అయింది. దీంతో ఆహా టెక్నికల్ టీమ్ శ్రమించి చివరికి ఆహా యాప్ ను పునరుద్దరించింది. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా యాప్ లోకి రావడంతో యాప్ క్రాష్ అయిందని ఆహా టీమ్ ట్వీట్ చేసింది.