Prabhas : ప్రభాస్ పెళ్లి చేసుకుంటే అసలు కెరీర్ ఉండదా..వేణు స్వామీ ఎంటి ఇలా తేల్చేశాడు.? అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు నెటిజన్స్ షాకవుతుంటే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఘోరంగా తిట్టుకుంటున్నారు. వేణు స్వామీ గత మూడు నాలుగేళ్ళుగా సినీ, రాజకీయ నాయకుల జాతకం చెప్తూ వారికి ఇప్పుడు కష్టాలు వస్తాయి..ఇప్పుడు విడిపోతారు…ఇలాంటి సమస్యల్లో కూరుకుపోతారు అంటూ ఓపెన్ సీక్రెట్స్ చెప్పేసి హాట్ టాపిక్ అయ్యారు. హీరోల ఫ్యాన్స్ వేణు స్వామీని సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేస్తున్నా కూడా ఆయన మాత్రం హైలెట్ అవుతున్నారు.
ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌నే కదిలించారు వేణు స్వామీ. మన డార్లింగ్‌కి ఇప్పటికే, 40 ఏళ్ళు. అయినా సినిమాల పెట్టిన దృష్ఠిలో కనీసం ఓ 20 శాతం కూడా తన వ్యక్తిగత జీవితం మీద పెట్టడం లేదు. పెళ్లి విషయంలో ప్రభాస్ అభిమానులే కాదు, కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఆయన మాత్రం అసలు దీని గురించి పట్టించుకోవడం లేదు. ఒకవైపు అనుష్క శెట్టి కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇదీ ఒక హాట్ టాపిక్‌గా ఉంది.
Prabhas : దీనిపై ఎలాంటి రియాక్షన్స్ ఇంకా రాబోతున్నాయో..?
ఇప్పుడేమో ఏకంగా వేణు స్వామీ జాతకం చెప్పేశాడు. ప్రభాస్ పెళ్లి చేసుకోకపోతేనే మంచిదని, ఆయన గనక పెళ్లి చేసుకుంటే అనారోగ్య సమస్యలు మొదలవుతాయని రివీల్ చేశారు. ఇది నిజమా కాదా అనేది పక్కన పెడితే, కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ ఇది విని భయపడుతుంటే, కొందరేమో వేణూ స్వామీని తిట్టుకుంటున్నారు. మరి దీనిపై ఎలాంటి రియాక్షన్స్ ఇంకా రాబోతున్నాయో చూడాలి. ఇప్పటికే, అఖిల్..నాగ చైతన్య – సమంతల గురించి పవన్ కళ్యాణ్, నిహారికల గురించి ఇలాగే చెప్పి హాట్ టాపిక్ అయ్యారు.