Prabhas: గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమాకు కన్నడ ఫ్యాన్స్ సెగ తగలనుందా అంటే, అది దర్శకుడు ప్రశాంత్ నీల్ చేతిలోనే ఉందంటున్నారు. అన్నిటికంటే చాలా చిన్న చిత్ర పరిశ్రమైన కన్నడలో అనూహ్యంగా అత్యంత భారీ సక్సెస్‌లు సాధించిన యాక్షన్ సిరీస్ కేజీఎఫ్. కేజీఎఫ్ ఛాప్టర్ 1 ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో దానికి నాలుగు రెట్ల సక్సెస్‌ను ఛాప్టర్ 2 సాధించింది. ఇదంతా దర్శకుడు ప్రశాంత్ నీల్ మేకింగ్, హీరో యష్‌ల శ్రమ అని ప్రత్యేకంగా చెప్పాల్సిందే.
ఇక ఈ సినిమాను బడ్జెట్ విషయంలో ఏ మాత్రం ఆలోచించకుండా భారీగా ఖర్చు చేసిన హోంబలే సంస్థ నిర్మాత విజయ్ కిరంగదూర్‌ను మెచ్చుకోవాల్సిందే. కథ, దర్శకుడిపై ఉన్న నమ్మకంతో కేజీఎఫ్ సిరీస్‌లను నిర్మించి సక్సెస్‌లు అందుకున్నారు. అయితే, ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే విజయ్ కిరంగదూర్ సలార్ అనే భారీ యాక్షన్ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ – శృతి హాసన్ జంటగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Prabhas: కన్నడలో స్ట్రైట్ వెర్షన్ రిలీజ్ చేయకపోతే మాత్రం గట్టిగానే ట్రోల్..?
అయితే, ప్రభాస్ సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రధాన భాషలలో రిలీజ్ చేస్తున్నారు. కానీ, అవన్నీ డబ్బింగ్ వెర్షన్స్. ఇదే ఇప్పుడు సలార్ సినిమాకు కన్నడ ఇండస్ట్రీ నుంచి సమస్యలు తెచ్చిపెట్టేలా ఉంది. దర్శకుడు, నిర్మాత ఇద్దరూ కన్నడ ఇండస్ట్రీ వారు కావడంతో ప్రభాస్ సలార్ చిత్రాన్ని కన్నడలో డబ్బింగ్ వెర్షన్ కాకుండా ఒరిజినల్ రీజినల్ లాంగ్వేజ్‌లో రిలీజ్ చేయాలని పట్టుపడుతున్నారట. ఒకవేళ కన్నడ అభిమానులు అనుకున్నట్టు సలార్ సినిమాను కన్నడలో స్ట్రైట్ వెర్షన్ రిలీజ్ చేయకపోతే మాత్రం గట్టిగానే ట్రోల్ వచ్చేలా ఉన్నాయనిపిస్తోంది. చూడాలి మరి మేకర్స్ ఎం ప్లాన్ చేస్తారో.