Prabhas: ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు సినిమాలలో నటించడమే కాకుండా కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ అదికాదాయం పొందుతున్నారు. ఈ క్రమంలో సెలబ్రిటీల స్టార్ ఇమేజ్ ని బట్టి వారి రెమ్యూనరేషన్ ఉంటుంది. ఇప్పటికే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లు ఇలా కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ వాటికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే కొంతమంది సెలబ్రిటీలు మాత్రం ఇటువంటి యాడ్స్ లో నటించడానికి ఆసక్తి చూపటం లేదు. అటువంటి వారిలో ప్రభాస్ కూడా ఒకరు. ప్రభాస్ ఇప్పటివరకు ఏ ఒక్క యాడ్ లో కూడా కనిపించలేదని అనుకుంటారు.
అలా అనుకుంటే పొరబడినట్టే. అవునండి… 2015 లో ఒక కారును ప్రమోట్ చేస్తూ ప్రభాస్ కూడా ఒక యాడ్ లో నటించారు. బాహుబలి సినిమా తర్వాత 2015 ప్రభాస్ మహేంద్ర కారుని ప్రమోట్ చేస్తూ ఓ యాడ్ లో నటించాడు. అయితే ఈ యాడ్ కోసం ప్రభాస్ ఎంత పారితోషికం తీసుకుని ఉంటాడు అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఎందుకంటే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. సాధారణంగా ఒక మోస్తారు గుర్తింపు వచ్చిన హీరోలు ఇలాంటి యాడ్స్ లో నటించటానికి కోట్లలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ ఉంటారు.
Prabhas: రూపాయి కూడా తీసుకోలేదా…
అలాంటిది పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన ప్రభాస్ ఇలా యాడ్లో నటించినందుకు ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదని సమాచారం. అంతే కాకుండా అదే సంస్థ మరోసారి యాడ్ చేయమని అడగ్గా.. ప్రభాస్ అందుకు రిజెక్ట్ చేసిన్నటు తెలుస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు రావడంతో వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి. దీంతో వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండటం వల్ల ప్రభాస్ ఇటువంటి కమర్షియల్ యాడ్స్ లో నటించటానికి సమయం కుదరలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ తో పాటు ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె వంటి సినిమాలతో ప్రభాస్ బిజిగా ఉన్నాడు.