Prabhas Sreenu: ప్రభాస్ శ్రీను పరిచయం అవసరం లేని పేరు నటుడుగా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ శీను ఈ మధ్యకాలంలో కాస్త సినిమాలను తగ్గించారని చెప్పాలి అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ ఎన్టీఆర్ హీరోగా యమదొంగ సినిమాలో నటిస్తున్న సమయంలో తన భార్యకు అబార్షన్ జరిగిందని తెలిపారు.
ఆ సమయంలో తాను ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు కూడా సంపాదించుకోలేకపోయానని తెలిపారు. కానీ ఈ విషయం తెలిసినటువంటి ఎన్టీఆర్ తనకు ఫోన్ చేసి ఎంతో ధైర్యం చెప్పారని తెలిపారు.ఇలాంటివన్నీ సర్వసాధారణంగా జరుగుతుంటాయి నువ్వేమీ భయపడకు నెక్స్ట్ పుట్టేవాడు నాలాంటోడే పుడతారు అంటూ తనకు చాలా ధైర్యం చెప్పారని ప్రభాస్ శీను వెల్లడించారు.మీరిద్దరూ ప్రశాంతంగా ఉండండి ఎక్కడికైనా ట్రిప్ వెళతారా టికెట్స్ బుక్ చేయమంటావా అంటూ నన్ను అడిగారని ఈయన తెలిపారు. అలా ఆ సమయంలో నన్ను ఓదారుస్తూ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారని ఈయన తెలియజేశారు.
Prabhas Sreenu: నాలాంటోడె పుడతాడు…
ఇక ఎన్టీఆర్ షూటింగ్ లోకేషన్ లో కనుక ఉంటే అందరితో చాలా సరదాగా ప్రేమగా ఉంటారని తెలిపారు. ఇకపోతే ఎన్టీఆర్ వంట చాలా అద్భుతంగా చేస్తారని ఈయన ఎన్నో రకాల వంటలను చాలా రుచిగా చేస్తారు అంటూ ప్రభాస్ శీను తెలిపారు. అయితే ఈ విషయాలన్నీ కూడా ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న వారికి మాత్రమే తెలుసని, ఆయన సర్కిల్లో ఉన్న వారిని ఎవరిని అడిగిన ఎన్టీఆర్ మంచితనం గురించి ఇలాగే చెబుతారని ప్రభాస్ శీను తెలిపారు. ఇక ప్రభాస్ శీను ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలలో నటించి సందడి చేశారు.ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.