Prabhas: టాలీవుడ్ స్టార్స్‌లో అందరికంటే ఎక్కువగా ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేస్తున్న హీరో అంటే గ్లోబల్ స్టార్ ప్రభాస్ ఒక్కడే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి సిరీస్ తర్వాత నుంచి ప్రభాస్ నటిస్తున్న ఏ సినిమా అప్‌డేట్స్ కరెక్ట్‌గా రావడం లేదు. సాహో సినిమా రెండేళ్ళకే రిలీజ్ అన్నాడు. కానీ, కుదరలేదు. ఆ తర్వాత ఏడాదిలో రాధే శ్యామ్ సినిమాను రిలీజ్ చేస్తానని చెప్పారు. అంతేకాదు, ఇకపై తన నుంచి ఖచ్చితంగా ఏడాదికో సినిమా రిలీజ్ చేస్తానని అభిమానులకు మాటిచ్చారు. కానీ, కరోనా కారణంగా రాధే శ్యామ్ 4 ఏళ్ళకు గానీ రిలీజ్ కాలేదు.
ఇక ఈ సినిమా విషయంలో అభిమానులు ఎంతగా ఫ్రస్టేట్ అయ్యారో అందరికీ తెలిసిందే. అనుకున్న సమయానికి ఈ సినిమా అప్‌డేట్స్ రాకపోవడంతో అభిమానులు తీవ్రంగా మేకర్స్‌పై మండిపడ్డారు. ఇప్పుడు అదే ఆదిపురుష్ సినిమా విషయంలో కూడా రిపీట్ అవుతోంది. బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓ రౌత్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయి చాలా నెలలవుతోంది. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ అలాగే, వీఎఫెక్స్ వర్క్ కూడా జరుగుతోంది.
Prabhas: అభిమానులను తీవ్ర మనస్తాపానికి గురిచేస్తోంది.
అయినా ఇప్పటి వరకు ఆదిపురుష్ మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రాలేదు. ఈ మూవీ నుంచి శ్రీరామనవమి నాడు ఫస్ట్ లుక్ వస్తుందని అందరూ ఆతృతగా ఎదురుచూశారు. కానీ, ఫ్యాన్స్ తయారు చేసిన ఫ్యాన్‌మేడ్ పోస్టర్స్ కలిపి ఓ చిన్న వీడియో వదిలి ఇంకా డిసప్పాయింట్ చేశారు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి ఒక్క చిన్న అప్‌డేట్ కూడా రాకపోవడం..అసలు ఎప్పుడొస్తుందో కూడా క్లారిటీ లేకపోవడం అభిమానులను తీవ్ర మనస్తాపానికి గురిచేస్తోంది. అసలు తన సినిమాల అప్‌డేట్స్ విషయంలో ప్రభాస్ చొరవ తీసుకుంటున్నాడా..? అనే సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి. అందుకే, ఇకపై ప్రభాస్ సినిమా అప్‌డేట్స్ కోసం ఎదురుచూడటం దండగా అని కామెంట్ చేస్తున్నారట.