Prabhas – Venu Swami: ప్రభాస్ కెరీర్ ఇక అంతే..ప్రముఖ ఆస్ట్రాలజీ వేణు స్వామీ కీలక వ్యాఖ్యలు..హర్ట్ అవుతున్న ఫ్యాన్స్..!

G K

PrabhasVenu Swami: ప్రభాస్ కెరీర్ ఇక అంతే అంటూ ప్రముఖ ఆస్ట్రాలజీ వేణు స్వామీ చేసిన కీలక వ్యాఖ్యలు తాజా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. ఈ వేణు స్వామీ..సినీ, రాజకీయ నాయకులకు సంబంధించిన పలువురు ప్రముఖుల జాతకాలు ఎలా ఉన్నాయి…వారి జీవితం ఎలా సాగబోతుంది..ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే ఎన్నో ముఖ్యమైన విషయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తుంటారు. అయితే, ఏ ఒక్కరు తమ జాతకం ఏంటో తెలియదు గానీ పక్కవాడి జాతకం గురించి మాత్రం చెప్పేస్తుంటారనే కామెంట్స్ కూడా ఆయన మీద ఇప్పటికే ఎన్నో సార్లు వచ్చిన సందర్భాలున్నాయి.

అంతకముందు అక్కినేని ఫ్యామిలీ హీరోల గురించి ఇలాంటి జాతక విషయాలను చెప్పి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. అఖిల్‌కి ఎంగేజ్‌మెంట్ మాత్రమే జరుగుతుంది పెళ్లి క్యాన్సిల్ అవుతుందని చెప్పుకొచ్చారు. అది నిజంగానే జరిగింది. ఆ తర్వాత నాగ చైతన్య, సమంత కలిసి జీవించలేరు. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోతారని వేణు స్వామీ భవిష్యత్ చెప్పారు. అదే జరిగింది. అయితే, ఇదంతా వేణు స్వామీ జాతకం ప్రకారమే జరిగిందా..లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే విడాకుల తర్వాత నాగ చైతన్య లైఫ్ అద్భుతంగా ఉంటుందని, సమంత జీవితం తారుమారవుతుందని చెప్పారు.

Prabhas – Venu Swami: ప్రభాస్‌తో సినిమాలు తీసే నిర్మాతలు చాలా జాగ్రత్తగా ఉండాలి..!

ఆ లెక్కన చూసుకుంటే చైతూతో విడిపోయాక సమంత కెరీర్ ఏ రేంజ్‌లో కొనసాగుతుందో అందరూ చూస్తున్నారు. చేతినిండా సినిమాలు, పలు కమర్షియల్ యాడ్స్..క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. కానీ, చైతూ సినిమాల పరిస్థితేంటీ అనేదీ మాత్రం క్లారిటీ లేదు. అంటే వేణు స్వామీ చెప్పిందే జరగడం లేదని అర్థమవుతోంది. అయితే, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ గురించి ఈ వేణు స్వామీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రభాస్ హీరోగా వచ్చిన రాధే శ్యామ్ సినిమా ఫ్లాపై నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. దాంతో వేణు స్వామీ..ఇకపై కూడా ప్రభాస్ సినిమాలు ఇలాగే ఫ్లాపవుతాయని, ఆయన జాతకం అంతే, అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ప్రభాస్‌తో సినిమాలు తీసే నిర్మాతలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. దాంతో వేణు స్వామీపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -