Prabhas: రెబెల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరం లేదు. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. పాన్ ఇండియా హీరో గా మొదటి స్థానంలో నిలిచాడు. మొదటిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఆ సినిమా అంతగా సక్సెస్ సాధించకపోయినా.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తరువాత వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత రెబెల్ స్టార్ గా అంచలు అంచెలుగా ఎదిగాడు. అయితే మరోసారి రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమాలు తీసి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.
అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. తను ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. అయితే బాహుబలి తర్వాత సాహో సినిమాతో ప్రభాస్ కు ఫ్లాప్ వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయినా అభిమానులు ఇంకా పెరిగారు. ఆ తర్వాత కూడా చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. వరుసగా ఆ సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వగా ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల ప్రభాస్ తన పెదనాన్న ను పోగొట్టుకున్నాడు.
అయితే సెప్టెంబర్ 11 వ తేదీన అనారోగ్యం కారణంగా ప్రభాస్ పెద్దనాన్న, ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణించిన విషయం తెలిసిందే. అయితే నేడు ప్రభాస్ పుట్టిన రోజు. ప్రతి సారి ప్రభాస్ ఘనంగా పుట్టిన రోజు జరుపుకునే అతను..పెద్దనాన్న లేని సమక్షంలో తన పుట్టిన రోజును పెద్దగా పట్టించుకున్నట్లు లేరు. అయినప్పటికీ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా తన అభిమానులు..పలువురు సినీ ప్రముఖులు అతన్ని పుట్టిన రోజు శభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో లో ప్రముఖ నటుడు మంచు విష్ణు కూడా ప్రభాస్ కు విషెస్ తెలిపాడు. కానీ అతను ప్రభాస్ కు విషెస్ తెలిపిన విధాన్నని ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే 40 ఏళ్లు అవ్వవచ్చినా ప్రభాస్ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉన్న విషయం తెలిసిందే. దీన్ని ఉద్దేశిస్తూ.. విష్ణు ప్రభాస్ పై కౌంటర్ ఇచ్చాడని ప్రభాస్ అభిమానులు మంది పడుతున్నారు. అయితే ఆ పోస్ట్ లో విష్ణు.. మరో తల్లికి పుట్టిన నా సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వచ్చే పుట్టినరోజు నాటికి అతడు పెళ్లిచేసుకుంటాడో లేదో నాకు తెలీదు కానీ కచ్చితంగా అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అయితే ఇస్తాడు. నా ప్రేమాభిమానాలు నీకెప్పుడూ ఉంటాయి డార్లింగ్ బ్రదర్ ప్రభాస్” అంటూ రాసుకొచ్చడు.
Prabhas: ప్రభాస్ పెళ్లి పై సెటైర్ వేసిన మంచు విష్ణు..
పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూనే ప్రభాస్ పెళ్లి పై సెటైర్ కూడా వేశారని.. కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంచు విష్ణుపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. ఇక తన పై మళ్లీ ట్రోలింగ్ నడపడానికి ఇది మరో వంక అని చెప్పవచ్చు.