Pragathi పిల్లలతో కలిసి పారిస్ లో ఎంజాయ్ చేస్తున్న ప్రగతి…. మామూలుగా లేదు

Joythi R

Pragathi సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ దక్కించుకున్నటువంటి టాలీవుడ్ నటీనటులలో తెలుగు బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి ప్రగతి ఒకరు. అయితే నటి ప్రగతి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో 1, 2 తెలుగు, మలయాళ చిత్రాలను హీరోయిన్ గా నటించింది. కానీ ఈ చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు పెళ్లి చేసుకుని సెటిలైంది. అయితే నటి ప్రగతి చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకోవడంతో చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. దీంతో దీంతో పెళ్లైన కొన్ని సంవత్సరాలకే నటి ప్రగతి తన భర్త నుంచి విడిపోయి తన ఇద్దరు పిల్లల సంరక్షణ కూడా తనే చూసుకుంటోంది.

ఇక బ్రతుకు తెరువు కోసం సినిమా ఇండస్ట్రీకి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నటి ప్రగతికి వరుస సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో నటి ప్రగతి అతి తక్కువ సమయంలోనే తన ఎమోషనల్ నటనతో తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక కరోనా కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వంటివి షేర్ చేస్తూ ఇక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ని బాగానే పెంచుకుంది. దీంతో నటి ప్రగతి సోషల్ మీడియాలో ఏదైనా ఫోటో లేదా వీడియో షేర్ చేస్తే వేలసంఖ్యలో లైకులు కామెంట్లు తక్కువ సమయంలోనే వస్తున్నాయి.

అయితే తాజాగా నటి ప్రగతి తన ఇద్దరు పిల్లలతో కలసి సమ్మర్ వెకేషన్ ని ఎంజాయ్ చేసేందుకు పారిస్ కి వెళ్లినట్లు సమాచారం. కాగా తాజాగా నటి ప్రగతి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన ఇద్దరు పిల్లలతో కలిసి ఐఫిల్ టవర్ దగ్గర దిగినటువంటి ఫోటోలను షేర్ చేసింది. దీంతో నటి ప్రగతి చాలా బ్యూటిఫుల్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే నటి ప్రగతి కూతురు కూడా చాలా క్యూట్ గా ఉందని హీరోయిన్ ఎంట్రీ ఎప్పుడు ఇవ్వబోతోందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి ప్రగతి తెలుగులో ఎఫ్3 అనే చిత్రంలో హీరోయిన్ తల్లి పాత్రలో నటించింది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. దీంతో ఈ నెల 27వ తారీకున ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా ఈ రోజు ఉదయం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది.

- Advertisement -