Pragathi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రగతి గురించి అందరికీ సుపరిచితమే. ఈమె ఎన్నో సినిమాలలో తల్లిగా అద్భుతమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు. తాజాగా ఈమె అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మొదటి షో నుంచి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రగతి తన సినీ కెరీర్ వెనుక ఉన్న కన్నీటి కష్టాలను బయటపెట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను కెరియర్ ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో మంచి పాత్రలలో నటించినప్పటికీ ఏదీ తనకు పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పుకొచ్చారు. ఇలా తనకు తగ్గ పాత్రలు రాకపోవడంతో ఎంతో ఒత్తిడికి గురయ్యానని,ఒత్తిడిని తట్టుకోలేక కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని తెలిపారు. తాను కాఫీ, టీ మోయడం దగ్గర నుంచి పెద్ద విలన్ పక్కన నిలోచవడం, అందమైన, యంగ్ అమ్మ పాత్ర వరకు చాలా వరుకు తాను సెట్ ప్రాపర్టీలా పని చేశానని ఏమి తెలిపారు.

Pragathi: నటిగా ఎంతో సంతృప్తినిచ్చింది..
ఇలా ఎన్నో పాత్రల్లో నటించిన ఇప్పటికే తనకు తగ్గ పాత్ర రాకపోవడంతో బాధ పడిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే తనకు ఎఫ్ 2 సినిమా ద్వారా ఒక బ్లెస్సింగ్ వచ్చింది. అనంతరం ఎఫ్ 3 సినిమా ద్వారా మరింత గుర్తింపు పొందినట్లు ఈ సందర్భంగా ఈమె తన కెరియర్లో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి వెల్లడించారు. ఈ సినిమా తనకు నటిగా ఎంతో సంతృప్తినిచ్చిందని ఈ సందర్భంగా ప్రగతి తెలిపారు. ప్రగతి ఇలా నటిగా కొన సాగుతూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు.