Pragathi టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా 70కి పైగా సినిమాలలో అమ్మ, అక్క, చెల్లి, వదిన తదితర పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది తెలుగు బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి. నటి ప్రగతి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒకటి, రెండు చిత్రాలలో హీరోయిన్ గా కూడా నటించింది. కానీ ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో పాటు కనీసం మొదలైనట్లు కూడా చాలా మందికి తెలియదు.
దీంతో హీరోయిన్ గా కెరీర్ కాస్త ముగిసిపోవడంతో తన వైవాహిక జీవితం పై దృష్టి సారించింది. కానీ ఈ బంధంలో కూడా నటి ప్రగతి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. దీంతో తన భర్తతో మనస్పర్ధలు, విభేదాలు రావడంతో వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో తన ఇద్దరు పిల్లల సంరక్షణ కూడా తానే తీసుకొని అన్నీ తానై పెంచుతోంది.
అయితే తాజాగా నటి ప్రగతి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. ఇందులో భాగంగా కొందరు తనని అప్పుడప్పుడు ఎందుకు అమ్మ క్యారెక్టర్లు చేస్తున్నావని అలాగే తన ఇమేజ్ తగ్గట్టుగా పాత్రలు చేయొచ్చు కదా అని అడుగుతున్నారనే విషయం గురించి మాట్లాడుతూ ఇలాంటి ప్రశ్నలు అడిగేవాళ్లకి సమాధానం చెప్పింది.
ఇందులో భాగంగా తాను నటి స్తానంలో ఉన్నప్పుడు ఎలాంటి పాత్రలోనైనా నటించి మెప్పించాలని అప్పుడే తన నటి స్థానానికి నిజమైన అర్థం ఉంటుందని తెలిపింది. అలాగే ప్రస్తుతం తనకి పిల్లలు ఉన్నారని కాబట్టి భవిష్యత్తులో వారికి తన పాత్రల వల్ల ఇబ్బంది కలగకూడదని డీసెంట్ పాత్రలో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే సినిమాల్లో తన పాత్రకి తగ్గట్టుగా నటిస్తూ 100% న్యాయం చేయడానికి ఎప్పుడూ వెనకాడని కూడా స్పష్టం చేసింది.

అలాగే తన వ్యక్తిగత జీవితంలో కూడా తన పిల్లలకి ఏమాత్రం లోటుపాట్లు రాకుండా చూసుకునే బాధ్యత విషయంలో కూడా ఏమాత్రం వెనకాడనని చెప్పుకొచ్చింది. ప్రగతి చేసిన ఈ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ నటి ప్రగతి ఒక మంచి ఆర్టిస్ట్ మాత్రమే కాకుండా గ్రేట్ మదర్ కూడా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సినిమా పరిశ్రమలో డబ్బు కోసం ఏ పాత్రలోనైనా నటించేవాళ్ళు చాలామంది ఉంటారని కానీ తన పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ముందుచూపుతో ఆలోచించేటువంటి ప్రగతి నిజంగా గ్రేట్ అని కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా నటి ప్రగతి ప్రస్తుతం తెలుగులో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్ 3 చిత్రంలోని ఓ కీలక పాత్రలో నటించింది. కాగా ఈ చిత్రం ఈ నెల 27వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్2 చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యింది. అందువల్లనే ఎఫ్3 చిత్రం సీక్వెల్ ని తెరకెక్కించారు.