Pragathi: సౌత్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన సీనియర్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో అమ్మ, అత్త, వదిన వంటి ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి తెలుగుదనం ఉట్టిపడే అందంతో ప్రగతి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే మరొకవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎంతో మందిని తన అభిమానులుగా మార్చుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రగతి షేర్ చేసే వర్కౌట్ వీడియోలు నిమిషాలలో వైరల్ అవుతూ ఉంటాయి.
ప్రగతి తన జిమ్ వర్కౌట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తరచూ అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఈ వీడియోలలో ప్రగతి కష్టతరమైన వర్కౌట్లు చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది. అయితే ఈ యవసులో ప్రగతి అలాంటి కష్టతరమైన వర్కవుట్లు చేయటం చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో ప్రగతి షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంతకాలం సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రగతి ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రగతి వెయిట్ లిఫ్టింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది.
Pragathi: పవర్ లిఫ్టింగ్ చేస్తున్న ప్రగతి…
ఈ క్రమంలో తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోని పంచుకుంది. ఈ వీడియోలో ప్రగతి షాకింగ్ లుక్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ సందర్భంగా వీడియోని షేర్ చేస్తూ ఓ సందేశాన్ని కూడా ఇచ్చింది .” కొత్త ఆరంభాలు.. రెండు నెలలుగా దీనిపై శ్రమిస్తున్నా. రెండు నెలల క్రితం జీవితం పూర్తిగా భిన్నమైన దారిలో పడుతుందని ఎప్పుడూ ఊహించలేదు. పవర్ లిఫ్టింగ్ లోకి నా కొత్త ప్రయాణం ప్రారంభమైంది. ఈ జర్నీ ఇప్పుడే ప్రారంభమయ్యింది. 250స్కోర్‌తో ప్రారంభించి, లక్ష్యాలు ఎక్కువగా ఉన్నాయి, నేను ఈ లక్ష్యాలను చేరుకునే వరకు విశ్రమించేది లేదు రాస్తూ… తాను `విజన్ డిసిప్లైన్ పవర్ నేషనల్ 2023` పోటీల్లో పాల్గొంటున్నట్టు ” ప్రగతి తెలిపింది. ప్రస్తుతం ప్రగతి న్యూ లుక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.