Praneetha : ప్రెగ్నెన్సీపై ప్రణీత కామెంట్స్ వైరల్.. ఆ విషయం నన్ను తీవ్రంగా బాధపెట్టిందంటూ!

Akashavani

Praneetha : తెలుగు ప్రేక్షకులకు ప్రణీత గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. బావ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాలో తన చక్కని అందంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు స్టార్ హీరోల సరసన నటించి నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఇక తన అందంతో తనకంటూ అడపాదడపా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు గర్భవతి అయిన సంగతి మనందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితం తన భర్త నితిన్ రాజు బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని ప్రణీత సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. గతంలో సోషల్ మీడియాలో అరుదుగా ఉండే ప్రణీత.. ప్రస్తుతం గర్భవతి అయిన తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ నెటిజన్ల కు పంచుకుంటుంది. ఇదే క్రమంలో ప్రణీత తన బేబీ బంప్ ని చూసుకుంటూ మురిసిపోతున్న స్నాప్ ను పంచుకుంది. ఇక ప్రస్తుతం ప్రణీత జిమ్ లో వర్కౌట్లు చేస్తూ దానికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో షేర్ చేస్తుంది. ఇదిలా ఉంటే ప్రణీత తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో తన ప్రెగ్నెన్సీ పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు బయటపెట్టింది.

తాను గర్భవతి అని తెలిసిన వెంటనే ఎంతో ఆనందంగా పొంగిపోయాను అని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఈలోపే ఒక విషయం తనను తీవ్రంగా బాధపెట్టింది అని తెలిపింది. హీరోయిన్స్ అందానికి బాడీ షేప్ లకు బాగా ప్రాధాన్యత ఇస్తారు. దాదాపు ఆడియన్స్ ద్రుష్టి మొత్తం మా పైనే ఉంటుంది. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత బాడీలో ఎన్నో మార్పులు వస్తుంటాయి.

Praneetha : ఈ ఆలోచనలు అన్నింటికీ ప్రనీత బేబీ బ్రేక్ ఇచ్చింది!

సో.. ప్రేక్షకులు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న ఆలోచన నన్ను బాగా వెంటాడింది. ఇక క్రమంగా అలాంటి ఆలోచనలు అన్నిటికీ నా కడుపులో ఉన్న బేబీ పూర్తిగా బ్రేక్ ఇచ్చేసిందని ప్రణీత చెప్పుకొచ్చింది.

- Advertisement -