Prank Video: సినిమాలను రూపొందించడం ఎంత కష్టమో ఆ సినిమాను ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే విధంగా చేయడం కూడా అంతే కష్టం అని చెప్పవచ్చు. సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే విధంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ను చేస్తూ ఉంటారు. ఒకవేళ వారు రూపొందించిన సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు అంటే వారు పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అయితే ప్రేక్షకులు ఈ మధ్య కాలంలో సినిమా థియేటర్లకు రావడం పూర్తిగా తగ్గించేశారు. దీనితో చిత్రబృందం సినిమాను ఆడియెన్స్ లోకి తీసుకెళ్లడానికి అనేక మార్గాలను ఎంచుకుంటోంది.
ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవలే అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా సమయంలో చేసిన ఫ్రాంక్ వీడియో చిలికి చిలికి గాలివానగా మారింది సంగతి తెలిసిందే. ఆ ఫ్రాంక్ వీడియో కాంట్రవర్సీ అవ్వడమే కాకుండా ఆ సినిమాకు కావల్సినంత పబ్లిసిటీ ని కూడా ఇచ్చింది. తాజాగా అదే విధంగా చేస్తే తమ సినిమాకు బెటర్ అవుతుంది అనుకున్నట్లుగా ఉన్నారు సాఫ్ట్ వేర్ బ్లూస్ అనే చిత్ర యూనిట్. మీరు కూడా తాజాగా ఒక ప్రాంక్ వీడియో చేయగా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరో శ్రీరామ్, హీరోయిన్ భావన కలసి ఫ్రాంక్ చేసే ప్రశాంత్ అనే అబ్బాయితో కలిసి ఒక ఫ్రాంక్ వీడియో చేయాలని అనుకుంటున్నట్లు మాట్లాడుతూ ఉంటారు.

Prank Video: చొక్కాలు చింపుకొని గొడవపడిన చిత్ర బృందం…
అప్పుడే అటుగా బైక్ పై వెళ్తున్న వ్యక్తి ఫ్రాంక్ వీడియోలేవీ చేసుకోనవసరం లేదు మీ వల్ల లొల్లి అవుతుంది,కాలనీలో డిస్టబెన్స్ జరుగుతుంది అంటూ బూతు మాటలు మాట్లాడుతూ హీరో శ్రీరామ్ ప్రశాంత్ పైకి గొడవకు వెళ్ళాడు. ఆ గొడవలో ప్రశాంత్ సదరు గొడవకు వచ్చి మధ్య మాట మాట తిరిగి తోపులాట కూడా జరిగింది. ఇద్దరూ చొక్కాలు కూడా చింపేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ చేతులు లాప్ టాప్ కూడా విరిగిపోయింది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న వాళ్ళు వారికి సర్ది చెప్పడంతో గొడవ సైలెంట్ అయిపోయింది. మొత్తానికి విశ్వక్ సేన్ ఫార్ములాను మరొక చిత్రయూనిట్ ఫాలో అయ్యింది. ఫ్రాంక్ వీడియోలు చేస్తే చేశారు కానీ ఇలా ఇతరులు డిస్టర్బ్ అయ్యే విధంగా గొడవలు పడుతూ అటెన్షన్ క్రియేట్ చేయడం ఎంతవరకూ అన్నది వారికే తెలియాలి మరి.