Prema: దేవి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సీనియర్ నటి ప్రేమ గురించి తెలియని వారంటూ ఉండరు. దేవి సినిమాలో నాగదేవత పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకొని వారి అభిమానాన్ని సొంతం చేసుకున్న ప్రేమ ఆ తర్వాత తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది. మొదట సవ్యసాచి అనే కన్నడ సినిమా ద్వారా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన ప్రేమ కన్నడలో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది.
ఇలా తెలుగు కన్నడ భాషలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న ప్రేమ గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రేమ తన సినీ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం గురించి కూడా అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల రిలేషన్ గురించి రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. అలాగే ప్రేమ విషయంలో కూడా ఇలాంటి రూమర్స్ వినిపించాయి.
Prema: వారినే అడగాలి…
కన్నడ హీరో ఉపేంద్ర, ప్రేమ రిలేషన్ గురించి రూమర్లు వినిపించాయి. గతంలో వీరిద్దరూ ప్రేమించుకుంటున్న వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ ఇంటర్వ్యూలో ఉపేంద్రతో ఉన్న రిలేషన్ గురించి ప్రశ్నించగా.. ఆ వార్తలు రాసిన వారిని అడగాలి అంటూ తనదైన శైలిలో సమాధానం చెప్పింది. ఆ సమయంలో సినిమాల పైనే నా ఫోకస్ ఉండేది. ఆ వార్తలలో నిజం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. అలాగే గతంలో తనకి క్యాన్సర్ అని వచ్చిన వార్తల గురించి కూడా స్పందిస్తూ… డిప్రెషన్ వల్ల కొంతకాలం ఆస్ట్రేలియాలో ఉండటంతో నాకు క్యాన్సర్ అని రూమర్స్ వినిపించాయి అని క్లారిటీ ఇచ్చింది.