Priya Anand ప్రియా ఆనంద్. ఈ పేరు టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే అప్పట్లో తెలుగులో ప్రముఖ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన రామ రామ కృష్ణ కృష్ణ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అలాగే మరిన్ని తెలుగు చిత్రాలలో కూడా నటించి బాగానే మెప్పించింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో వెబ్ సిరీస్ లలో నటించేందుకు మొగ్గు చూపుతుంది.
కాగా ఇటీవల ప్రముఖ ఓటిటి అయినటువంటి జి ఫైవ్ లో ప్రసారం అవుతున్న మా నీళ్ల ట్యాంక్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. కాగా ఈ వెబ్ సిరీస్ లో హీరోగా తెలుగు ప్రముఖ హీరో అక్కినేని సుశాంత్ నటించాడు. అయితే ఇటీవలే నటి ప్రియా ఆనంద్ మరియు సుశాంత్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా నటి ప్రియాంక కాబోయే వరుడు ఎలా ఉండాలని విషయాలు గురించి ప్రేక్షకులతో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఈ క్రమంలో తనని పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఆస్తిపాస్తులు వంటివి లేకపోయినప్పటికీ మంచి మనసు ఉండాలని అంతేకాకుండా ఎప్పుడూ కూడా తనను హ్యాపీగా ఉంచేందుకు ప్రయత్నించాలని తెలిపింది. అలాగే మంచి వ్యక్తిత్వం అనేది ఎప్పుడూ కూడా తన చుట్టుపక్కల పరిస్థితుల ప్రభావం అలాగే తల్లిదండ్రుల పెంపకం వంటి వాటి ఆధారంగానే వస్తుందని కాబట్టి మంచి నడివడిక ఉంటే చాలని తెలిపింది. ఇక అబద్ధాలు, మాయమాటలు చెబుతూ మోసం చేసే వాళ్ళని అస్సలు నమ్మనని అలాగే సహించనని కూడా తెలిపింది.
దీంతో ప్రస్తుతం నటి ప్రియా ఆనంద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మొన్నటి వరకు ప్రముఖ స్వామీజీ అయిన నిత్యానంద్ ని పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పిన ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా మంచి లక్షణాలు ఉండాలని చెప్పడంతో కొందరు నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.
అయితే తెలుగులో ఇప్పటివరకు నటి ప్రియా ఆనంద్ 4 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. కానీ ఇందులో కనీసం ఒక్కటి కూడా ఈ అమ్మడికి కలిసి రాలేదు. దీంతో ప్రియా ఆనంద్ కి టాలీవుడ్ లో ఆదరణ కరవడంతో మలయాళం, తమిళ్ వంటి సినీ పరిశ్రమలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో దాదాపుగా 20 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించి బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ మధ్యకాలంలో ప్రియా ఆనంద్ కొంతమేర గ్లామర్ కి స్కోప్ ఉన్నటువంటి పాత్రలు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ బ్యూటీ సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా ఘాటుగా అందాలు ఆరబోస్తూ కుర్ర కారు మతిపోగొడుతోంది.