Priyamani : జాతీయ అవార్డు అందుకున్న స్టార్ హీరోయిన్ ప్రియమణి. తెలుగుతో పాటు తమిళ సినిమాలలో స్టార్ హీరోలతో నటించి బ్లాక్ బస్టర్స్ అందుకుంది. కెరీ మంచి పీక్స్ లో ఉండగానే 2017 సంవత్సరంలో ముస్తఫా రాజ్ ను ప్రియమణి పెళ్ళి చేసుకుంది. పెళ్ళి తర్వాత సినిమాలకి దూరమయింది. అయితే బుల్లితెరపై మాత్రం బాగానే సందడి చేస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి మళ్ళీ స్టార్ హీరోలతో నటించే అవకాశాలు అందుకుంది. ఇది తనకి సెకండ్ ఇన్నింగ్స్ అని..మళ్ళీ నా సత్తా చూపిస్తానంటూ ఇటీవల పలు ఇంటర్వ్యూస్ లో ప్రియమణి వెల్లడించింది.

Priyamani with Mustafa Raj

వెంకటేశ్ తో నారప్ప, రానాతో విరాట పర్వం సినిమాలు చేసింది. కాగా తాజాగా నారప్ప రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో నారప్పలో ప్రియమణి పోషించిన పాత్రకు మంచి పెరరు వస్తోంది. ఈ ఆనందంలో ఉన్న ప్రియమణికి పెద్ద షాక్ తగిలింది. అది కూడా తన పెళ్ళికి సంబంధించింది కావడం ఇప్పుడు సోషల్ మీడియాలో, మీడియా వర్గాలలో వైరల్ అవుతోంది. ఉన్నపలంగా ఈమె వివాదంలో చిక్కుకుంది. ముస్తఫా రాజ్ తో ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ప్రియమణి మీద ముస్తఫా రాజ్ మొదటి భార్య సంచలన వ్యాఖ్యలు చేసింది.

Priyamani : ముస్తాఫా రాజ్, అయేషాను పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే.

ప్రియమణిని పెళ్లి చేసుకోక ముందే ముస్తాఫా రాజ్, అయేషాను పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే ఇద్దరి మధ్య విభేధాలు తలెత్తడంతో పరస్పర అంగీకారంతో విడిపోయారు. కానీ అధికారికంగా మాత్రం విడాకులు తీసుకోలేదు. ఇదే ఇప్పుడు ప్రియమణిని చిక్కుల్లో పడేసింది. తమ పిల్లల సంరక్షణ చూసుకుంటున్న ముస్తాఫా రాజ్, వారికి అండగా ఉంటూ ఆర్థికంగా వారికి సహాయంగా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రతి నెల కొంత డబ్బు పంపిస్తున్నాడు.

Priyamani with Mustafa Raj

అయితే ఈమద్య కాలంలో అయేషా.. తమను ముస్తఫా పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలు చేసింది. ఆయన ఆర్ధికంగా సహాయం చేయడం లేదని మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేసింది. దాంతో ఈ వివాదం మరింతగా ముదిరింది. దీనిని ముస్తఫా కొట్టి పారేస్తూ వచ్చినా ఇప్పుడు ఇష్యూ పెద్దదైంది. అయేషా ఈ విషయాన్ని మరింత పెద్దది చేస్తోంది. అసలు తన నుండి విడాకులు తీసుకోకుండా.. ముస్తఫా ఎలా ప్రియమణిని పెళ్లి చేసుకుంటాడు అంటూ సూటిగా ప్రశ్నిస్తుంది. వారిద్దరి పెళ్లి చట్ట విరుద్దం అంటూ ఆమె ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనం అయింది. అంతేకాదు మీడియా ముందుకు వచ్చి ప్రియమణి – ముస్తఫా పెళ్లిని సమర్థించవద్దని విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో అభిమానులు ఇప్పుడు ప్రియమణి పరిస్థితేంటి అని చర్చించుకుంటున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 23, 2021 at 8:13 ఉద.