Priyanka Chopra: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలలో ఎక్కువగా నటిస్తోంది. తాజాగా ప్రియాంక చోప్రా నటించిన సీటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనింది. ఈ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలో ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఈ ఇంటర్వ్యూలో ప్రియాంక పిల్లలు అంటే తనకు ఎంతో ఇష్టమని అందువల్ల పెళ్లికి ముందే పిల్లల కోసం తన అండాలను దాచిపెట్టినట్లు ప్రియాంక వెల్లడించింది. ఈ మేరకు ప్రియాంక చోప్రా మాట్లాడుతూ…” నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం.ఎక్కువ సమయం పిల్లలతో గడపాలని కోరుకుంటాను. అందువల్లే పెళ్లికి ముందే 30 ఏళ్ళలోపే నా అండాలను దాచిపెట్టాను. భవిష్యత్తులో నాకు నచ్చిన వ్యక్తితో పిల్లల్ని కనడం కోసం మా అమ్మ సలహా మేరకు నా అండాలను భద్రపరిచాను అంటూ ప్రియాంక వెల్లడించింది.
Priyanka Chopra: చాలా స్వేచ్ఛగా అనిపించింది…
పెళ్లికి ముందే అల చేయటం వల్ల నాకు చాలా స్వేచ్చగా అనిపించింది. ఆ స్వేచ్ఛ వల్లే నా కెరీర్ లో ముందుకు వెళ్లి అనుకున్నది సాధించగలిగాను… అంటూ ప్రియాంక వెల్లడించింది. అయితే నిక్ జోనస్ ని వివాహం చేసుకున్న తరువాత తనకు పిల్లలు కనాలని ఉండేదని, కానీ తన భర్త వయసు తక్కువగా ఉండటం వల్ల అతనికి పిల్లలని కనటం ఇష్టమో? కాదో? అని సందేహంతో పెళ్లికి ముందు అతనితో డేటింగ్ చేయటానికి కూడా ఒప్పుకోలేదని ప్రియాంక వెల్లడించింది. ఇక ప్రస్తుతం ప్రియాంక సరోగసి ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చింది.