Priyanka Jawalkar అలా ఉన్నావని హీరోయిన్ ని కామెంట్ చేసిన క్రికెటర్…. వామ్మో ఏకంగా అలా అనేసిన హీరోయిన్…

Joythi R

Priyanka Jawalkar ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలు బాగానే యాక్టివ్ గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అప్పుడప్పుడు కొందరు తమకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు వంటివి కూడా షేర్ చేస్తూ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నారు. అయితే ఇందులో హీరో లేదా హీరోయిన్లు షేర్ చేసిన ఫోటోలు లేదా వీడియోలు బాగుంటే నెటిజన్లతో పాటు అప్పుడప్పుడు ఇతర సెలబ్రిటీలు కూడా స్పందిస్తుంటారు. ఇందులో భాగంగా కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

ఇందులో భాగంగా తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక అందమైన ఫోటోని షేర్ చేసింది. దీంతో లక్షల సంఖ్యలో నెటిజన్లు ఈ ఫోటో ని లైక్ చేశారు. అలాగే ప్రియాంక జవాల్కర్ చాలా క్యూట్ గా ఉందంటూ వేల సంఖ్యలో కామెంట్లు చేశారు. అయితే ఇందులో ప్రముఖ భారత క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ కూడా ఈ అమ్మడి అందానికి ఫిదా అయ్యాడు. ఈ క్రమంలో ఏకంగా క్యూట్ అంటూ కామెంట్ చేశాడు. దీంతో ప్రియాంక జవాల్కర్ ఈ కామెంట్ కి స్పందించింది. ఇందులో భాగంగా ఏకంగా ఎవరు నువ్వు..? అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా వెంకటేష్ అయ్యర్ అభిమానులు ప్రియాంక జవాల్కర్ ను తెగ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇండియన్ ఫేమస్ క్రికెటర్ అయిన వెంకటేష్ అయ్యర్ ను గుర్తు పట్టకపోవడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వందల సంఖ్యలో నెటిజన్లు ఈ కామెంట్లపై స్పందిస్తూ వెంకటేష్ అయ్యర్ ఎవరనే విషయం గురించి ప్రియాంక జవాల్కర్ కి చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.

Priyanka Jawalkar అలా ఉన్నావని హీరోయిన్ ని కామెంట్ చేసిన క్రికెటర్.... వామ్మో ఏకంగా అలా అనేసిన హీరోయిన్...
Priyanka Jawalkar అలా ఉన్నావని హీరోయిన్ ని కామెంట్ చేసిన క్రికెటర్…. వామ్మో ఏకంగా అలా అనేసిన హీరోయిన్…

ఈ విషయం ఇలా ఉండగా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తన సత్తా నిరూపించుకున్నాడు. దీంతో నేషనల్ ఇండియా టీం కూడా సెలెక్ట్ అయ్యాడు. కాగా ప్రస్తుతం కలకత్తా నైట్ రైడర్స్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక ప్రియాంక జవాల్కర్ ఆ మధ్య తిమ్మరుసు అనే చిత్రంలో కనిపించింది. కానీ చిత్రం విడుదలైనట్లు కూడా చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పెద్దగా సినిమా ఆఫర్లేమీ లేవు. దీంతో ఈ బ్యూటీ తమిళ సినిమా ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

- Advertisement -