Prudhvi Raj: ఈమధ్య కాలంలో ఉన్నటువంటి నటీనటులు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు.. ఏ వయసు వారిని పెళ్లి చేసుకుంటున్నారు.. అన్నది అర్థం లేకుండా పోయింది. హీరోయిన్లు చూస్తే తమ కన్నా చాలా చిన్న వయసు ఉన్న కుర్రోళ్ళను పెళ్లి చేసుకుంటే.. ఇక హీరోలు అయితే ఏకంగా తమ కన్నా ఎంతో ఎక్కువ ఏజ్ ఉన్న ఆంటీలనే పెళ్లి చేసుకుంటున్నారు.

ఇక ఈ అంశాన్ని మనం ఎక్కువగా బాలీవుడ్ లో చూశాము. బాలీవుడ్ లో ఎక్కడ చూసినా అసలు ఒక వయస్సు ఐడెంటిటీ కరెక్టుగా లేకుండా పోయింది. ఏ వయసును వారిని పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుంటున్నారు. వయసుతో పనేముంది ఇష్టం ఉంటే చాలు అన్నట్టు కామెంట్లు చేసి మరీ పెళ్లి చేసుకుని మీడియా ముందు తెగ తిరిగేస్తున్నారు.

అయితే వీళ్ళని చూసి చాలామంది బయట ప్రపంచంలో చదువుకునే పిల్లలు చెడిపోతున్నారు. ఎందుకంటే సమాజంలో కూడా ఇలాంటివన్నీ జరగడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే సెలబ్రిటీలు ఇలా తమ వయసుకున్న ఎక్కువ.. తమ వయసుకున్న తక్కువ వాళ్ళని ప్రేమించడం.. పెళ్లి చేసుకోవడం బాలీవుడ్ లో జరిగితే ఇప్పుడు కోలీవుడ్ లో కూడా జరుగుతుంది.

కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పృథ్వీరాజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. పెళ్లి సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్ తెలుగులో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హస్యనటుడిగా, విలన్ గా నటించాడు. కొన్ని సీరియల్స్ లో కూడా నటించాడు. ఆయనకు 34 ఏళ్ల క్రితం బీనా అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

గత కొంతకాలంగా తన భార్య తో ఆయన దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే పృథ్వీరాజ్ మలేషియాకు చెందిన 23ఏళ్ల యువతిని సిక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడని కోలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పలువురు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. అయితే దీని పై స్పందిస్తూ.. తమిళ బిగ్ బాస్ బ్యూటీ కాజల్ పసుపతి మాత్రం పృథ్వీరాజ్ ను సమర్థిస్తూ ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Prudhvi Raj:  బబ్లూ రెండో పెళ్లి పై నటి పోస్ట్ హల్చల్ ..

తన పోస్టులో.. అతడికి ఆ కెపాసిటీ ఉంది.. పెళ్లి చేసుకున్నాడు.. ఇందులో మీకు వచ్చే సమస్య ఏంటీ.. విష సమాజంలో అసూయపు మనుషులు.. అంటూ రాసుకొచ్చింది. అయితే కాజల్ పసుపతి పోస్టుపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. అతని గురించి నీకెందుకు బాధ అన్నట్టు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కాజల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on అక్టోబర్ 23, 2022 at 3:40 సా.