Punch Prasad: కామెడీ షో జబర్దస్త్ ద్వారా పరిచయమైన పంచ్ ప్రసాద్ గురించి అందరికి పరిచయమే. ఈయన తన కామెడీతో తెలుగు ప్రేక్షకులకు బాగా ఫిదా చేశాడు. తన పంచ్ లతో మాత్రం బాగా నవ్విస్తాడు. నిజానికి ఈయన కామెడీ టైమింగ్ మాత్రం అదిరిపోతుందని చెప్పవచ్చు.
ఇక ఈయన గతంలో తన అనారోగ్య సమస్య వల్ల జబర్దస్త్ కు దూరం అయ్యాడు. మళ్లీ ఈ మధ్యనే రీఎంట్రీ ఇచ్చాడు. ఇదివరకే ఆయన రెండు కిడ్నీల సమస్యతో బాధపడుతున్నాడన్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాన్ని తను జబర్దస్త్ వేదికపై పలుమార్లు తెలిపాడు కూడా. అంతటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా తన వృత్తికి మాత్రం గౌరవిస్తూనే ఉన్నాడు.
అంతలోనే ఇటీవలే ఈయనకు మరో సమస్య వచ్చింది. ఓ కమెడియన్ యూట్యూబ్ ద్వారా ఈయన అనారోగ్య పరిస్థితిని అందరికీ తెలియజేశాడు. ఆ సమయంలో ప్రసాద్ పరిస్థితి మాత్రం చాలా దారుణమైన స్థితిలో ఉండేది. ఇప్పుడు ఆయన కోలుకోగా మళ్లీ జబర్దస్త్ లో అడుగు పెట్టాడు. తన అనారోగ్య సమస్యలు అన్ని మర్చిపోయి మళ్లీ తన కామెడీతో నవ్విస్తున్నాడు.
అంతే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చేస్తున్నాడు ప్రసాద్. అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఇందులో కమెడియన్స్ తమ పర్ఫామెన్స్ తో బాగా సందడి చేశారు. అయితే చివర్లో పంచ్ ప్రసాదుకు సంబంధించిన ఫ్యామిలీ ఫోటోను రివిల్ చేశారు. అందులో తన తల్లిదండ్రులతో తన అక్క, అన్న కూడా ఉన్నారు.
Punch Prasad ఎమోషనల్ అయిన పంచ్ ప్రసాద్..
ఇక ఆ ఫోటో చూసి ప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు. ఇక ఆ ఫోటో తల్లి బలవంతంగా దింపించింది అని అన్నాడు. అలా కొన్ని విషయాలు పంచుకుంటూ తన అక్క చనిపోయింది అంటూ, అన్న కూడా చనిపోయాడు, తన తండ్రి కూడా చనిపోయాడు అని చివరికి తన తల్లి తను మాత్రమే ఉన్నాము అని అనటంతో అక్కడున్న వాళ్లంతా మౌనంగా ఉండిపోయారు. తన దగ్గర అదొక్కటే ఫోటో ఉంది అని ఎమోషనల్ గా మాట్లాడాడు. ప్రస్తుతం ఆ ప్రోమో బాగా వైరల్ అవుతుంది.