Puri Jagannadh Heroines: సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరో హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూ తమ సత్తా చాటుకుంటారు అయితే కొంతమందికి తమ టాలెంట్ తో పాటు అదృష్టం తోడవడంతో వారు టాప్ సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఇప్పటికీ ఆగ్రహ హీరోయిన్లగా వెలుగు వెలుగుతున్నారు. ఇకపోతే ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమంత రకుల్ కాజల్ పూజ హెగ్డే వంటి హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్ద కాలమైనప్పటికీ ఇంకా వీరి హవా కొనసాగుతోంది. ఇక వీరి తర్వాత వచ్చిన ఎంతో మంది హీరోయిన్లు మొదటి రెండు సినిమాలకే ఇండస్ట్రీ నుంచి దూరమయ్యారు. అలాంటి వారిలో నిధి అగర్వాల్, నభా నటేష్ వంటి వారు ఒకరు.
వీరిద్దరూ ఇండస్ట్రీకి ఒకేసారి పరిచయమయ్యారు. సవ్యసాచి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ తన సినిమాతో పెద్ద ఎత్తున అందరిని సందడి చేశారు. అయితే ఈ సినిమా అనంతరం పలు సినిమాలలో నటించిన నిధి అగర్వాల్ కు సరైన హిట్టలేని సమయంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇకపోతే నిధి అగర్వాల్, నభ నటేశ్ ఇద్దరూ కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో సందడి చేశారు.
Puri Jagannadh Heroines: నభాతో పోలిస్తే కెరియర్ లో ముందంజలో ఉన్న నిధి…
ఈ విధంగా ఈ సినిమాలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మలిద్దరూ కూడా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇకపోతే నిధి అగర్వాల్ సినిమాల విషయానికి వస్తే ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అలాగే పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరుమల్లు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నిధి అగర్వాల్ మరొక హీరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలా ఉండగా నభా విషయానికి వస్తే .. అవకాశాలను ఎంత ఫాస్టుగా అందుకోవచ్చునో చూపించింది. ‘డిస్కోరాజా’ .. ‘సోలో బ్రతుకే సో బెటర్’ .. ‘అల్లుడు అదుర్స్’ .. ‘మాస్ట్రో’ సినిమాలను చకచకా చేసేస్తూ వెళ్లింది. అయితే ఈమె ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు.