Puri Jagannadh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ గురించి అందరికీ సుపరిచితమే.టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే ఆయన దర్శకుడిగా మాత్రమే కాకుండా పూరి కనేక్ట్స్ బ్యానర్ పై నటి చార్మితో కలిసి సంయుక్తంగా సినిమాలను చేస్తున్నారు.అయితే ఇండస్ట్రీలో గత కొంత కాలం నుంచి పూరి జగన్నాథ్ చార్మి గురించి ఎన్నో రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పూరి జగన్నాథ్ చార్మి మధ్య ఏదో సంబంధం ఉందనే వార్తలు వినపడుతున్నాయి.
ఇకపోతే వీరిద్దరూ కలిసి సినిమాలను నిర్మించడం వల్ల ఎక్కువగా ముంబైలో నివసించడమే కాకుండా పలు పార్టీలకు ఇద్దరూ కలిసి హాజరవడంతో వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఛార్మి కోసం డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన భార్యకు విడాకులు ఇచ్చారనే వార్తలు కూడా వినపడ్డాయి.అయితే తాజాగా పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి చోర్ బజార్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా పూరి జగన్నాథ్ విడాకుల గురించి మాట్లాడారు.

Puri Jagannadh: అమ్మ నాన్నలు ప్రేమ వివాహం చేసుకున్నారు…
నాన్న సినీ కెరీర్ లోకి అడుగు పెట్టిన తర్వాత ఒకానొక సమయంలో చాలా నష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ సమయంలో అమ్మ పరిస్థితులను అర్థం చేసుకొని నాన్నకు ఎంతో సపోర్ట్ గా నిలిచారు.ఆ సమయంలో వారు పడే కష్టాలు మాకు తెలియకుండా ఉండడం కోసం మమ్మల్ని హాస్టల్ లో చేర్పించి వాళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చివరికి ఇల్లు కార్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇలాంటి సమయంలో అమ్మ నాన్నను అర్థం చేసుకొని నాన్నకు చేదోడువాదోడుగా ఉన్నారు. ప్రస్తుతం మా ఫ్యామిలీ ఈ పొజిషన్లో ఉంది అంటే అందుకు కారణం అమ్మనే. అయితే వీరిద్దరి మధ్య ఎప్పుడు ప్రేమను చూశాను కానీ విడాకుల గురించి ప్రస్తావన ఇదివరకు ఎప్పుడూ వినలేదు. పని పాట లేని వాళ్ళు మాత్రమే ఇలాంటి వార్తలు రాస్తుంటారు.నిజానికి నాన్న దగ్గర ఏమీ లేనప్పుడే అమ్మ నాన్న చేయి పట్టుకొని బయటికి వచ్చి నాన్నను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి మధ్య అంత ప్రేమ ఉంది అంటూ ఆకాశ్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం ఆకాష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.