Puri Jagannath టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ గా రాజమౌళి, పూరి జగన్నాథ్‌లకి ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా మారాడు. కానీ పూరి జగన్నాథ్ ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు. అయితే పూరి సినిమాలో హీరో ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆ రకంగా పూరికి పాన్ ఇండియన్ రేంజ్ లో కాస్త క్రేజ్ ఉన్నట్టే. అయితే ‘కేజీఫ్ 1 ‘ సినిమాతో కన్నడ ఇండస్ట్రీ నుంచి ఏకంగా పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా ప్రశాంత్ నీల్ కూడా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఒకరకంగా ఇప్పుడు ఆయన ప్రాజెక్ట్స్ లైనప్ చూస్తుంటే ఏకంగా రాజమౌళికే చెక్ పెట్టబోతున్నాడనే టాక్ సౌత్ మొత్తం వినిపిస్తోంది.

రాజమౌళి పాన్ ఇండియన్ సినిమా అంటే కనీసం రెండేళ్లు సమయం తీసుకుంటున్నాడు. కానీ ప్రశాంత్ నీల్ పక్కాగా ప్లాన్ చేస్తే 8 నుంచి 9 నెలల్లో ఇదే పాన్ ఇండియన్ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేస్తున్నాడు. గత ఏడాదే విడుదల కావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఈ ప్రాజెక్ట్ లో రాం చరణ్, జూనియర్ ఎన్.టి.ఆర్ లాకయ్యారు. ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ అనుకున్నారు. అయితే అది సాధ్యం కాదని తాజాగా వార్తలు వస్తున్నాయి. 2022 జనవరి 26 న రిపబ్లిక్ డేకి ‘ఆర్ఆర్ఆర్’ వస్తుందని తెలుస్తోంది. ఇక ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పూర్తి చేసిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ రిలీజ్ కావాల్సి ఉంది. అలాగే ఇప్పుడు ప్రభాస్‌తో ‘సలార్’ అనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 2022 లో తీసుకు రానున్నాడు.

Puri jagannath : పూరి జగన్నాథ్..రాజమౌళి, ప్రశాంత్ నీల్‌ కంటే స్పీడ్‌గా సినిమా కంప్లీట్ చేసే డైరెక్టర్..!

ఆ తర్వాత జూనియర్ ఎన్.టి.ఆర్, అల్లు అర్జు, రాం చరణ్, ప్రభాస్‌లతో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే వీరిద్దరి కంటే స్పీడ్‌గా సినిమా కంప్లీట్ చేసే డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఫస్ట్ టైమ్ విజయ్ దేవరకొండతో ‘లైగర్’ అనే పాన్ ఇండియన్ సినిమా తీస్తున్నాడు. సెప్టెంబర్ 9న రిలీజ్ చేయనున్నారని ప్రకటించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే, పూరి పాన్ ఇండియన్ సినిమా బడ్జెట్ 120 కోట్లు మాత్రమే. పాన్ ఇండియన్ సినిమాలలో అతి తక్కువ బడ్జెట్ సినిమా ఇదే. ఇక పాన్ ఇండియన్ సినిమా అయినా పూరి 4 నెలల్లో పూర్తి చేస్తున్నాడు. ఈ రకంగా సినిమా మేకింగ్ అండ్ బడ్జెట్ విషయంలో రాజమౌళి, ప్రశాంత్ నీల్‌లకి త్వరలో చెక్ పెట్టబోతున్నాడు పూరి జగన్నాథ్ అని చెప్పుకుంటున్నారు. కాగా ‘లైగర్’ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 19, 2021 at 11:39 ఉద.