Pushpa 2: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ పొందిన ఈయన ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇక నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈయన నటిస్తున్న పుష్ప 2 సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడమే కాకుండా, ఈ సినిమా నుంచి టీజర్ కూడా విడుదల చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
అన్ని భాషలలోనూ ఈ టీజర్ భారీ స్థాయిలో వ్యూస్ కైవసం చేసుకుంది. తెలుగులో ఈ టీజర్ విడుదలైన అతి కొద్ది గంటలలోనే 18 మిలియన్ల వ్యూస్ సాధించగా హిందీలో మాత్రం ఏకంగా 20 మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. ఇక ఇందులో అల్లు అర్జున్ లుక్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పాలి. ముఖ్యంగా ఇందులో డైలాగ్ అడవిలోని జంతువులు రెండు అడుగులు వెనక్కి వేసాయి అంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి రెండు అడుగులు వెనక్కి వేసింది అంటే పుష్ప వచ్చాడని అర్థం అని చెప్పే డైలాగ్ ఎంతో ఫేమస్ అయ్యింది.
Pushpa 2: టీజర్ కోసమే అన్ని కోట్లా…
ఇక ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ టీజర్ ప్రచారం కోసం మేకర్స్ భారీగానే ఖర్చు చేశారని తెలుస్తోంది.కేవలం సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఈ టీజర్ కు భారీ స్థాయిలో వ్యూస్ రావడం కోసం మేకర్స్ ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది.ఇలా టీజర్ కోసం నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేయడంతో ముందు ముందు ఈ సినిమా ప్రచారం కోసం ఇంకా ఏ స్థాయిలో మేకర్స్ ఖర్చు చేస్తారనే విషయం గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.