Pushpa 2: అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప 2 సినిమా పనులు ప్రస్తుతం శర వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లిలో జరుగుతోంది. ఇదిలా ఉండగా పుష్ప 2 ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న వాహనం నార్కట్ పల్లి వద్ద ప్రమాదానికి గురయ్యింది. షూటింగ్ పూర్తయిన తర్వాత తిరిగి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తొంది. ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ డి కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పలువురు ఆర్టిస్టులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకొని ప్రమాదంలో గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రమాదంలో గాయపడిన అందరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ కూడా ప్రమాదం గురించి తెలిసిన వెంటనే క్షతగాత్రులను పరామర్శించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గతంలో విడుదలైన పుష్ప సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 సినిమాని రూపొందిస్తున్నారు. గతంలో విడుదలైన పుష్ప సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైనప్పటికీ పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచింది.

Pushpa 2: గాయాలతో బయటపడిన ఆర్టిస్టులు…
ఆ సినిమా మంచి హిట్ అవటంతో సుకుమార్ పుష్ప 2 సినిమా మీద మరింత శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 నుండి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ విడుదల చేశారు. ఇవి ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమా మీద అంచనాలు భారీగా పెంచేశాయి. పుష్ప మొదటి భాగం కన్నా రెండవ భాగం మరింత అకుట్టుకునేల ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.