Pushpa 2: ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం పుష్ప 2. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసి సంచలనాలు సృష్టించింది. దీంతో పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై షూటింగ్ పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే బన్నీ బర్త్ డే సందర్భంగా పుష్ప-2 ఫస్ట్‌లుక్ పోస్టర్ తో పాటు గ్లింప్స్ వీడియో కూడా రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమాపై అంచనాలను చేశాయి.
ఇదిలా ఉండగా పుష్ప లోని ఉ అంటావా మామ ఉ ఊ అంటావా మామ అనే పాప ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. అయితే పుష్ప 2 లో అలాంటి ఒక సూపర్ ఐటం సాంగ్ ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేల ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ మీడియా కథనం ప్రకారం పుష్ప 2 లో ఉండే మూడు నిమిషాల ఐటమ్ సాంగ్ కోసం ఆమె అధిక మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
Pushpa 2: స్పెషల్ సాంగ్ కోసం అన్ని కోట్లా…
ఈ పాట కోసం ఏకంగా రూ.6 నుంచి రూ.7 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేయగా నిర్మాతలు కూడా ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వటానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా పుష్ప 2 సినిమా గురించి ఒక్కొక్క వార్త బయటకు రావడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన అల్లు అర్జున్ పుష్ప 2 తో పాన్ వరల్డ్ హీరోగా మారిన ఆశ్చర్యం లేదు.